Showing posts with label Beauty Tips. Show all posts
Showing posts with label Beauty Tips. Show all posts

Wednesday, 1 February 2017

అలంకరణ చెదరకుండా..

అలంకరణ చెదరకుండా..
ఉదయం గీతగీసినట్టుగా పొందిగ్గా పెట్టుకున్న కాటుక సాయంత్రం వరకూ అలానే ఉండాలనేం లేదు. కాసేపటికే చెదిరిపోతుంది. ఒక్క కాటుకతోనే ఈ సమస్య కాదు... లిప్‌స్టిక్‌, ఐలైనర్‌ వంటివన్నీ అలంకరించుకున్న కాసేపటికే చెదిరిపోతుంటాయి. దీన్నే స్మడ్జింగ్‌ అంటూ ఉంటాం. అలా కాకుండా వేసుకున్న మేకప్‌ వేసుకున్నట్లుగా ఉండాలంటే..
ప్రైమర్‌ అంటే ప్రాథమిక అలంకరణ వస్తువు. కంటి అలంకరణ చేసుకోవడానికి మందు అంటే ఐలైనర్‌ వేస్తుంటే ఆ ముందు ప్రైమర్‌ని కచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్‌స్టిక్‌ని ప్రయత్నించేవారూ ప్రైమర్‌ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. ప్రైమర్‌ వేసి ఆపై అలంకరణ చేసుకుంటే అది సాయంత్రం వరకూ చెదరకుండా ఉంటుంది.
కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా అక్కడ పౌడర్‌ని వేసినా ఉపయోగం ఉండదు. కాసేపటికీ ఆ పౌడర్‌ తొలగి నలుపు కనిపిస్తుంది. అందుకని ముందుగా కన్సీలర్‌ వేసుకుని పౌడర్‌ అద్దుకోవాలి.
చాలామందికి మ్యాటీ తరహా లిప్‌స్టిక్‌ అంటే చాలా ఇష్టం. అంటే లిప్‌గ్లాస్‌ మాదిరిగా కాకుండా కాస్త గరుకుగా కనిపిస్తుందిది. కానీ వేసిన కాసేపటికే చెరిగిపోవడం దీని లక్షణం. అలా కాకుండా ఉండాలంటే... ముందుగా పెదాలపై పేరుకున్న మృతకణాలని తొలగించి కొద్దిగా లిప్‌బామ్‌ రాయాలి. అదనంగా ఉన్న బామ్‌ని టిష్యూతో తుడిచి ఆపై లిప్‌లైనర్‌ వేసి ఆ మధ్యలో మ్యాటీలిప్‌స్టిక్‌ని నింపాలి. ఒకసారి టిష్యూతో తుడిచి ఆపై మళ్లీ వేయాలి. ఇలా అయితే చెక్కు చెదరకుండా ఉంటుంది.
కొద్దిగా హెయిర్‌స్ప్రేని టూత్‌బ్రూష్‌పై తీసుకుని దానితో కనుబొమల్ని దువ్వుకోవాలి. అవి రోజంతా చెదరకుండా ఉంటాయి.

Sunday, 29 January 2017

పెదవులు పగులుతున్నాయా ?

అందమైన పెదవులు మగువకు ఎంతో అందాన్ని చేకూరుస్తాయి.అయితే శీతాకాలంలో ఎక్కువగా పెదవులు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి.మరి ఇలా పెదాలు పగలకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే మీ పెదవులు గులాబీరేకుల్లా సుతారంగా ఉంటాయి.
»
పెదవులు ఎక్కువగా పగులుతుంటే వాటికి పాల మీగడ రాయాలి.
»
గులాబీ రేకులను పాలలో కలిపి పెదవులపై రాసి కొంచెం సేపాగిన తర్వాత కడుక్కుంటే మృదువుగా తయారవుతాయి.
»
పెదాలపై వున్న నలుపు పోగొట్టాలంటే తేనే,గ్లిజరిన్,నిమ్మరసం కలిపి రాసుకోవాలి.
»
మీగడలో సెనగ పిండి,నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.

బ్యూటీపార్లర్లలో ఈ నియమాలు పాటించండి

బ్యూటీపార్లర్లలో ఈ నియమాలు పాటించండి

కాలం మారిపోయింది..ఇప్పుడు 60+లో ఉన్నవాళ్లు కూడా టీనేజ్‌లో ఉన్నవారిలా కనపించాలని చూస్తున్నారు. ఆడ లేదు మగా లేదు అందరికి అందంపై విపరీతమైన ఆరాధన పెరిగిపోయింది. అందుకోసం ఖర్చుకు కూడా వెనుకాడటం లేదు. అందుకే బ్యూటీ పార్లర్లకు ఫుల్ డిమాండ్. అయితే బ్యూటీపార్లర్‌లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయని చెబుతున్నారు నిపుణులు...

* బ్యూటీపార్లర్‌కు వెళ్లినప్పుడు వారు అమ్మే ఓల్డ్ హెన్నాకొని వాడటం అంత మంచిది కాదట
* మొటిమలు తొలగించడానికి ఫేషియల్‌ విధానం అంతగా మంచిది కాదు..ఫేషియల్    చేయించుకునేటప్పుడు తప్పనిసరిగా తలకి బట్ట కట్టించుకోవాలి. అక్కడికి వెళ్లేముందు పర్సనల్     దువ్వెన వెంట తీసుకెళ్లడం మంచిది.
* బ్యూటీపార్లర్లలో ఎప్పుడు లిప్‌స్టిక్ కానీ, కళ్ళకాటుకను వేయించుకోరాదు..
* తరచూ బ్లీచింగ్ చేయించుకోకూడదు..కనీసం ప్రతీ బ్లీచింగ్‌కు మూడు నెలల వ్యవధి ఉండాలి.
* ఫేషియల్ చేయించుకొనేటప్పుడు ఫ్రూట్స్‌తో చేయించుకోవడం మంచిది.
* పెడిక్యూర్, మానిక్యూర్ లు చేసే పరికరాలు ఇన్ ఫెక్షన్ కలిగించే అవకాశం వుంది. కనుక ఆయా పరికరాల్ని ఉపయోగించిన ప్రతిసారి   స్ట్రెరైల్ చేశారో లేదో బ్యూటీషియన్స్‌ని అడగటం మరిచిపోవద్దు

చలికాలంలో మీ చర్మం పొడిగా మారుటకు గల కారణాలు ఇవే... Causes of dry skin in winter sesson

చలికాలంలో మీ చర్మం పొడిగా మారుటకు గల కారణాలు ఇవే... Causes of dry skin in winter sesson
1.చలికాలంలో పొడి చర్మం
  • చలికాలంలో చర్మం పొడిగా మారటానికి చలి కారణం అనుకుంటారు. కానీ, ఈ కాలంలో చర్మం పొడిగా మారటానికి చలి ఒక్కటే కాదు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవును, మనం వాడే మందులు, రోజు వారి కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం వంటివి కారణం కావచ్చు. ఆ కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 2

    వేడితో నీటి స్నానం

    చలికాలంలో నీటిని తాకాలంటే కూడా భయమే! ఈ కాలంలో మనం ముఖం కడుక్కోవాలన్న కూడా వేడి నీటి కోసం చూస్తూంటాము. అవునా! ఇంకా స్నానానికైతే మరిగే నీరు కావాల్సిందే. కానీ, వేడి నీరు మనం చర్మంలో ఉండే సహజ తేమ మరియు నూనెలను కోల్పోయేలా చేసి, చర్మాన్ని పొడిగా మారుస్తుందని చేలా మందికి తెలియని విషయం. కావున ఈ రోజు నుండి వేడి నీటిని కాకుండా, గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయండి.
  • 3

    ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం

    చలికాలం వచ్చిందంటే చాలు టోనర్స్, లోషన్, బాడీ క్రీములు కొని తెచ్చి పెట్టుకుంటాము. కానీ కొన్ని రకాల ఉత్పత్తులు ఆల్కహాల్ ను కలిగి ఉంటాయి, ఆల్కహాల్ కలిగి ఉండే ఉత్పత్తుల వాడకం వలన చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. మీ చర్మం పొడిగా ఉండకూడదు అంటే ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండండి.
  • 4


    పొడి చర్మం కూడా వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని చెప్తే మీకు నవ్వు రావచ్చు! కానీ ఇది నిజం. అవును మీ కుటుంబీకులలో ఎవరైన పొడి చర్మం కలిగి ఉంటే మీరు కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోండి.
  • 5

    మందుల వాడకం

    శరీర కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు, కేన్సర్ నివారణా మందులు వాడుతున్నారా? అయితే మీరు కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రకమైన మందుకు వాడే వారిలో చర్మం పొడిగా మారి పొలుసులుగా రాలుతుంది.

  • Saturday, 28 January 2017

    ఈ కిటుకులు తెలుసా..

    ఈ కిటుకులు తెలుసా..
    ప్రత్యేక సందర్భాల్లోనే కాదూ.. రోజూ ఎంతో కొంత అలంకరణ చేసుకోవడం కూడా ఇప్పుడు మామూలైపోయింది. మరి మనం చేసుకునే అలంకరణ వల్ల కాస్త యౌవనంగా కనిపించాలంటే ఎలాంటి కిటుకులు పాటించాలో చూద్దాం.
    ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే చర్మానికి సరిపోయే ఫౌండేషన్‌ని గబగబా రాసేసుకుంటారు కొందరు. అంతకన్నా ముందు మీ ముఖానికి కాస్త మాయిశ్చరైజర్‌ పట్టించండి. లేదంటే ఫౌండేషన్‌లో ఉన్న తేమను మీ ముఖం పీల్చేసుకుని సన్నని ముడతల్లాంటివి ఉంటే కాసేపటికి కనిపిస్తాయి.
    కళ్ల అడుగున నల్లని వలయాలూ, చర్మంపై అక్కడక్కడా ఉన్న మచ్చల్ని కనిపించకుండా చేసేందుకు చాలామంది ఫౌండేషన్‌నే వాడుతుంటారు. కానీ దానికి బదులుగా కన్సీలర్‌ రాయండి. అవి కనిపించకుండా ఉంటాయి.
    కాస్త పెద్దవారయితే మీరు పౌడర్‌ని వీలైనంత తక్కువగా రాసుకోవాలి. అది ముడతల్లో చేరి, అవి ఇంకా స్పష్టంగా కనిపించొచ్చు.
    పెదవులకు లిప్‌స్టిక్‌ అంతా రాసుకున్నాక... కొద్దిగా పెట్రోలియంజెల్లీని కింది పెదవి మధ్యలో అద్దండి. దీనివల్ల రంగు ఎక్కువసేపు ఉండటమే కాదు.. పెదవులూ నిండుగా, యౌవనంగా కనిపిస్తాయి.