Showing posts with label Life Style. Show all posts
Showing posts with label Life Style. Show all posts

Sunday, 5 February 2017

నాజూగ్గా ఉండాలంటే..


నాజూగ్గా ఉండాలంటే..




కేవలం అందానికే కాదు.. ఆరోగ్యం కోసం కూడా సన్నగా మారాలనుకునేవారు వీటిని పట్టించుకోవాల్సిందే... 
ఆహారం మానొద్దు : వ్యాయామాలెన్ని చేసినా పూటకి ఆహారం తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తుంటారు. దీనివల్ల శరీరానికి తగినంత శక్తి అందదు. ఆకలివల్ల కనిపించిన ప్రతి చిరు తిండివైపు మనసు లాగేస్తుంది. దాంతో శరీరం బరువు తగ్గదు. 
ఏం తినాలి? : ఉదయాన్నే పాలు, పాల సంబంధిత ఉత్పత్తులను తప్పనిసరిగా తీసుకోవాలి. ఉడికించిన గుడ్డులోని తెల్లటి భాగం, తృణధాన్యాలతో చేసిన అల్పాహారాన్నీ ఎంచుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో కూరగాయలూ, ఆకుకూరలు ఉండేలా చూడాలి. మధ్యలో ఆకలేస్తే పండ్లముక్కలు, నట్స్‌ వంటివి ఎంచుకోవచ్చు. వీటితో అటు పోషకాలు అందడమే కాదు.. బరువూ తగ్గుతారు. 
నడక : గంటల పాటు కదలకుండా కూర్చునే ఉద్యోగంలో ఉన్నారా? ఐతే ఉదయం పూట అన్ని వ్యాయామాలతోపాటూ నడకనీ తప్పనిసరి చేసుకోండి. దాంతోపాటూ కార్యాలయంలో మంచినీళ్లూ, టీలూ, ఆహార పదార్థాలను కూర్చున్న చోటుకే తెప్పించుకోకుండా మీరే నడిచి వెళ్లి అందుకోండి.

BEAUTY TIPS IN TELUGU,HEALTH TIPS,WOMENS HELTH,PERFECT BODY STRUCTURE...

Wednesday, 1 February 2017

వ్యాయామం చేయలేకపోతున్నారా!

వ్యాయామం చేయలేకపోతున్నారా!
అధికబరువుని తగ్గించుకోవాలనీ, అనారోగ్యాలకు దూరంగా ఉండాలనీ చాలామంది వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ దాన్ని ఆచరణంలో పెట్టడంలోనే విఫలమవుతుంటారు. మీ సమస్య కూడా అదే అయితే ఇలా చేసి చూడండి.
వ్యాయామం అంటే మొదటి రోజే కిలోమీటర్ల కొద్దీ నడవడం, పరుగులు తీయడం ఒళ్లు నొప్పులు పుట్టేట్లు బరువులెత్తడం కాదు. దానికి అలవాటు పడేలా మీ శరీరాన్ని మార్చుకోవాలి. అంటే జీవనశైలిని వ్యాయామానికి అనుగుణంగా చేసుకోవాలి. మొదట సరైన నిద్రాహారవేళల్ని పాటించండి. అప్పుడే పొద్దున్నే నిద్రలేవగలరు. చురుగ్గానూ వ్యాయామం చేయగలరు.
మీ దినచర్యలో వ్యాయామాన్ని ఓ భాగం చేయండి. అంటే ఇంటిపనుల్లో మీ అమ్మకు సాయం చేయండి. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా మీ అల్మారాను సర్దుకోండి. ఎతైన అరల్లో ఉన్నవాటిని తీసి ఎప్పటికప్పుడు సర్దడం కూడా వ్యాయామంలో ఓ భాగమే. అంతేకాదు మునివేళ్లపై నిలబడి రెండు చేతుల్నీ పైకెత్తి వాటిని తీసి సర్దడం వల్ల శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగుతుంది.
వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇంట్లో చేయడం వల్ల బద్ధకం రావచ్చు. అలా కాకుండా దగ్గర్లోని యోగా కేంద్రం, జిమ్‌ లాంటిచోట్ల చేరండి. పార్కుకు వెళ్లి వ్యాయామం చేయడం వల్ల మీ సమయం కూడా సద్వినియోగం అవుతుంది.