Sunday 29 January 2017

చెవిపోగుల్ని ఎంచుకోండి

చెవిపోగుల్ని ఎంచుకోండి
ఇలా... దుస్తులు ఎంచుకోవడంతోనే స్టైలింగ్‌ పూర్తయ్యిందనుకుంటారు అమ్మాయిలు. కానీ వాటికి తగ్గ నగలూ ఉన్నప్పుడే కొత్తగా కనిపిస్తారు. కాలేజీ అమ్మాయిలకయితే ఇతర నగల మాటెలా ఉన్నా....లోలాకులు, స్టడ్స్‌, హూప్స్‌ వంటివాటిని ఏఏ సందర్భాల్లో ఎలా ఎంచుకోవచ్చో తెలుసుకోవడం చాలా అవసరం.
* చెవి పోగులు ఎన్ని ఉన్నా...చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తుంది ఇయర్‌ కఫ్‌. మీ నగలపెట్టెలో దాన్నొకటి ఉంచుకుంటే కాస్త ప్రత్యేకం అనుకున్న ఏ సందర్భానికైనా పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించేయొచ్చు.
ముత్యం పొదిగిన చెవి దిద్దులు, వేలాడే లోలాకులు.. వంటివి కాలర్‌లేని టాప్‌లూ, ట్యాంక్‌ టాప్‌లకు చక్కగా నప్పేస్తాయి.
ఏకరంగులో ఉండే దుస్తులకు అచ్చం అదే రంగులో ఉండే జుంకాలను కాకుండా మరో రంగులో ఉండే వాటిని ఎంచుకోవాలి. ముఖ్యంగా కాస్త పెద్ద స్టడ్స్‌ని ఎంచుకుంటే కాక్‌టెయిల్‌ పార్టీల వేళ చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తాయి. ఉదాహరణకు నలుపు రంగు దుస్తులకు తెలుపు రంగు చెవిపోగుల్ని ఎంచుకోవాలి.
సంప్రదాయ దుస్తుల మీదకు చిన్న రింగులు, దిద్దులు, జుంకాలు బాగుంటాయి. రాత్రిపూట జరిగే వేడుకలకు హాజరవుతున్నప్పుడు క్రిస్టల్స్‌, రాళ్లతో చేసినవి పెట్టుకుంటే ఆ అందమే వేరు.

No comments:

Post a Comment