Sunday 29 January 2017

అదిరేటి స్కర్ట్‌ మీరేస్తే!

అదిరేటి స్కర్ట్‌ మీరేస్తే!
  అతిసాధారణ అమ్మాయిల్నీ హాంఫట్‌ అన్నట్టు అత్యాధునిక యువతుల్లా మార్చేస్తుంది.. స్కర్టు!
ఒకప్పడు విదేశీ, కార్పొరేట్‌ ఉద్యోగినులకే పరిమితమైనా.. ఇప్పుడు రోజువారీ అవసరాలకు తగ్గట్టూ
అందరికీ అందివస్తోంది. కాకపోతే స్కర్టు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. చక్కగా నప్పితే ఎంత ఆధునికంగా అనిపిస్తుందో.. కుదురుగా లేకుంటే అంతే ఇబ్బందిగా మారుతుంది. అదీ మన సమాజంలో!! అందుకే మన రంగూ, రూపూ, పొడవూ, సందర్భాలకు తగ్గట్టే ఎంచుకోవాలంటున్నారు డిజైనర్‌ అనూ పెల్లకూరు. అందుకేం చేయాలో కూడా చెబుతున్నారు..
ఈ రోజుల్లో స్కర్టు వేసుకోవడానికి ఓ సందర్భం అవసరంలేదు. అలాని ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడం కూడా సరికాదు. సందర్భానికి తగిన రకాలెన్నో ఇప్పుడు అమ్మాయిలకు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో కుచ్చిళ్లు (ప్లీటెడ్‌), బయాస్‌, తులిప్‌, గేదర్డ్‌, టియర్డ్‌, లేయర్డ్‌, డబుల్‌ లేయర్డ్‌, హ్యాండ్‌ కర్చీఫ్‌, ఎసెమెట్రికల్‌, హై అండ్‌ లో, డబుల్‌ ప్యానల్‌, మినీ, మాక్సీ వంటి స్కర్టులు మదిదోచేస్తున్నాయి.

అలనాటి తరహాలో..
టీనేజీ అమ్మాయిలకు మోకాలు (నీ లెంగ్త్‌), పిక్కలు (కాఫ్‌ లెంగ్త్‌) వరకూ ఉండే మాక్సీ, ప్లీటెడ్‌, గేదర్డ్‌ తరహా స్కర్టులు బాగుంటాయి. సౌకర్యంగానూ అనిపిస్తాయి. ముఖ్యంగా చక్కని ప్రింట్లూ,
జేబులు ఉన్నవాటిని ఎంచుకుంటే మరీ మంచిది.
కాలేజీల్లో సమావేశాలూ, ఫెస్ట్‌లు లాంటివి ఉన్నప్పుడు తులిప్‌, పెన్సిల్‌, బాక్స్‌ ప్లీటెడ్‌ తరహా స్కర్టులు నప్పుతాయి. రోజు వేసుకునేవయితే పొడవు ఎలా ఉన్నా.. అది మరీ వదులుగా అలాగని బిగుతుగా లేకుండా చూసుకోవాలి.
ఒకప్పుడు అమ్మాయిలు వేసుకునే రెట్రో కాఫ్‌ లెంగ్త్‌, బాక్స్‌ ప్లీటెడ్‌ స్కర్టులకు ఇప్పుడు ఆదరణ పెరిగింది. సినిమాలూ, రెస్టారంట్లకూ వాటిని వేసుకోవచ్చు.
స్నేహితులతో సరదాగా చేసుకునే పార్టీలూ, చిన్నచిన్న వేడుకలూ ఉంటాయి కదా.. అలాంటప్పుడు మ్యాక్సీ స్కర్టు, ఎసెమెట్రికల్‌, మోకాలిపైవరకూ ఉండే టైట్స్‌, హైలోస్‌ వంటివి ప్రయత్నించొచ్చు. బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ తరచూ ఎంచుకునే బాక్స్‌ ప్లీటెడ్‌ తరహా స్కర్టు కూడా ఈ సందర్భానికి బాగుంటుంది. వీటిని ఉతకడం, భద్రపరడం కూడా తేలికే కాబట్టి.. తరచూ వేసుకున్నా ఏ ఇబ్బందీ ఉండదు.

జేబులు ఉండటమే ట్రెండ్‌..
ద్యోగినులకు డిజైను తక్కువగా ఉండే ఫార్మల్‌వేర్‌ స్కర్టులు బాగుంటాయి. వాటికి జేబులు ఉండటమే ఇప్పటి ట్రెండ్‌. ఏవయినా కార్యక్రమాలు లేదా సమావేశాలకు హాజరవుతున్నప్పుడు పెన్సిల్‌ కట్‌, షార్ట్‌లేయర్డ్‌ తరహా బాగుంటాయి. ప్లీటెడ్‌ స్కర్టులూ ఎంచుకోవచ్చు. ఫార్మల్‌వేర్‌ స్కర్టు ఏదయినా సరే మోకాలికి రెండు అంగుళాలకు పైకి లేదా మూడు అంగుళాలు కిందకి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆకట్టుకునేలా కనిపిస్తారు.
విధులకు, కాలేజీ సెమినార్లు, ప్రజెంటేషన్లు వంటి సందర్భాలకు స్కర్టు ఎంచుకోవాలనుకున్నప్పుడు ప్రింట్లు బాగుండవు. ఒకవేళ అవే వేసుకోవాలని అనుకుంటే గళ్ల ప్రింటున్న దాన్ని ఎంచుకోవచ్చు.
రంగుల విషయానికి వస్తే ముదురు ఎరుపు, మిల్కీ రంగులు, వూదా, నలుపు బాగుంటాయి. స్కర్టు ఎలాంటిదయినా దానిమీదకి టీషర్టు, ట్యాంక్‌టాప్‌లు ఎంచుకోవచ్చు. అయితే వాటినీ అలానే వేసుకోవాలని లేదు. అదనంగా వెయిస్ట్‌కోట్‌, బ్లేజర్‌ వంటివాటిని ప్రయత్నించొచ్చు.

ఆకృతికి తగినట్లుగా..
న్నగా ఉన్నవారికి కాస్త పొడవు తక్కువగా ఉన్న స్కర్టులు బాగుంటాయి. మోకాళ్ల వరకూ ఉన్నవీ అప్పుడప్పుడూ వేసుకోవచ్చు.
హాఫ్‌ లెంగ్త్‌ స్కర్టులు ఎత్తు తక్కువగా ఉన్నవారికి అతికినట్టు సరిపోతాయి.
నడుముభాగం కాస్త లావుగా ఉన్నవారికి పొడవాటి లాంగ్‌స్కర్టులు నప్పుతాయి. కాస్త బొద్దుగా, తమ శరీరాన్ని నిండైన ఆకృతిలో కనిపించేలా చేయాలనుకునేవారికి హై వెయిస్టెడ్‌ తరహా బాగుంటాయి. అంటే పొట్టపైకి ఉండేలా చూసుకోవాలి. వివాహాలు ఇతర వేడుకల్లో ధగధగలాడేలా క్రాప్‌టాప్‌లతో వీటిని ధరించినా వారెవ్వా అనిపించొచ్చు.
పార్టీవేర్‌గా ఎంచుకునే స్కర్టులు తెలుపు, నలుపుతో పాటు ముదురు గులాబీ, ఎరుపు రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. ప్రకాశవంతమైన రంగులు మీకు కొత్తందాన్ని తీసుకువస్తాయి.
పొడుగ్గా ఉన్నవారు స్కర్టులమీదకు టీషర్టుల్లాంటివే వేసుకోవాలని లేదు. పొడవాటి టాప్‌లు కూడా ప్రయత్నించొచ్చు.

No comments:

Post a Comment