Sunday 29 January 2017

భర్తతో శృంగారభరిత రాత్రిని గడుపుటకు ఉపయోగపడే చిట్కాలు

భర్తతో శృంగారభరిత రాత్రిని గడుపుటకు ఉపయోగపడే చిట్కాలు



మీ భర్తతో ఒక శృంగారభరిత రాత్రిని గడిపడానికి ఆసక్తి కలిగియున్నారా? సరే, మీ ఇద్దరికి అనుకూలించే విధంగా ఒక శృంగార రాత్రి ప్రణాళిక వేసుకొని ఆ ప్రత్యేక సందర్భం కోసం వేచి ఉండాల్సిన అవసరంలేదు. ఇంటర్నెట్లో కావలసిన దానికంటే ఎక్కువగా అందుబాటులో వుండే వివిధ ఆలోచనలను ఉపయోగించి, మీకు తగిన విధంగా ఒక ప్రణాళికను తప్పనిసరిగా తయారు చేసుకోవచ్చు. కానీ ఆ రాత్రి చిరస్మరణీయంగా మరియు చిరకాలంగా నిలిచిపోవడానికి మీరు బాగా సిద్ధమైన? మీరు ఇద్దరు కలిసి ఒక రాత్రిని గడిపినట్లయితే, అది ఖచ్చితంగా ప్రత్యేకమైనదే, కానీ దానిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి, మీ సన్నాహాలు ప్రత్యేకంగా ఉండాలి. మీ భర్తతో ఒక అద్భుతమైన శృంగార రాత్రిని గడపడానికి అవసరమయ్యే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియపరచడం జరిగింది.

Tips to Spend a Romantic Night with Your Man in Telugu

మూసధోరణికి అతీతంగా ఆలోచించండి

మీరు ఇప్పటికీ కొలను పక్కన ఒక క్యాండిల్లైట్ విందు చేయడమనే ఆలోచన వద్దే ఇరుక్కొని ఉన్నారా? సరే, ఇది ఒక శతజయంతైన ఆలోచన మరియు దీనితో మీ భర్త అసలు ఆశ్చర్యానికి లోనుకాకపోవచ్చు. శృంగార రాత్రి గడపడానికి ఒక ప్రదేశాన్ని నిర్ణయించటానికి, మొదట మీ భర్తకు ఇక్కడ ఇష్టపడతాడో, అనగా అతను ఇంట్లో సమయం గడిపడం కోరుకుంటారా, థియేటర్ వద్దన, తన అభిమాన నైట్ క్లబ్ పార్టీలోన లేదా నైట్ అవుట్ వద్దనా అనే విషయాన్ని తెలుసుకొండి. డేట్ సంగతి చెప్పడంకు బదులుగా మీరు అతనితో ఒక సాధారణ సంభాషణను జరిపి మరియు అతని ప్రాధాన్యతలను తెలుసుకోవచ్చు.


రహస్యంగా ఉంచండి

ఆశ్చర్యానికి గురిచేయడం అనేది మహిళల కోసం మాత్రమే ఉద్దేశించినవని ఎవరు చెప్పారు? సరే, ఆశ్చర్యానికి గురి చేయడం లేదా గారాబము చేయడం వలన పురుషులు కూడా ఆనందిస్తారని మేము మీకు చెప్పగలం. మీరు ఇద్దరు కలిసి ఒక శృంగార రాత్రి గడిపుదాం అనే మీ ప్రణాళికలను గురించి అతనికి చెప్పకండి, కానీ మీరు అనుకున్న సమయంలో అతనికి వేరే ఇతర పనులు ఉన్నాయో లేవో తప్పక  నిర్ధారించుకోండి.


దయచేసి! పిల్లలు ఉండకుండా చూసుకోండి

మీ డేట్ సమయంలో పిల్లలు మీతో ఉండాలనుకుంటున్నారా? లేదు, ఎప్పటికీ అలా చేయకూడదు! పిల్లల కోసం ఒక అయాను నియమించండి లేదా కొన్ని గంటల వరకు వారిని వాళ్ళ తాతయ్య ఇంట్లో వదిలేసి వెళ్ళండి. మీ శృంగార రాత్రి డేట్ కుటుంబ వినోదయాత్రగా మారిపోకుండా ఉండేలా నిర్ధారించుకోండి. ముందుగానే ప్రణాళిక వేసుకోండి మరియు మీ డేట్ మధ్యలో పిల్లలతో సంబంధితమైన ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా  సాయంత్రం వేళ మీ పిల్లలు ఉండే చోటుకు భాఅస్వామిని రమ్మని చెప్పండి.


డేట్ కోసం మంచి దుస్తులు ధరించండి

డేట్ కి ముందు రోజు షాపింగ్ చేయండి. మీ భర్తకి ఇష్టమైన రంగులో అద్భుతమైన దుస్తులను కొనుగోలు చేయండి. ఏవైనా కొత్తగా ఉండే అన్యదేశ మేకప్ ను లేదా ఒక కొత్త కేశాలంకరణను చేసుకోవడానికి ప్రయత్నించండి, కానీ అతిగా తయారుకాకండి. మీ వేషధారణ మీకు నచ్చినట్లయితే మరియు మీ భర్తకు కూడా నచ్చవచ్చు! మీ కోసం దుస్తులను కొనుగోలు చేసే సమయంలో, బహుమతిగా మీ భర్తకు కూడా ఒక చొక్కాను తీసుకోండి.


డేట్ కు ముందు గదిని తనిఖీ చేయండి

ఒక శృంగారభరిత రాత్రిని హోటల్ గదిలో చేసుకోవాలని మీరు ప్రణాళిక వేసుకున్నట్లయితే, ఉదయం వేళ ఒకసారి హోటల్ గదిని తనిఖీ చేయండి మరియు వీలైతే అతను వచ్చేకంటే ముందు  కూడా మీ గదిని తనిఖీ చేయవచ్చు. గదిని అలంకరించటానికి హోటల్ సిబ్బందిని కూడా అడగవచ్చు లేదా మీ అంతట మీరే కూడా చేసుకోవచ్చు. రాత్రి వేళ మీ మానసిక స్థితి ఉన్నతంగా ఉండేందుకు గాను మీ గదిలో ఒక వైన్ లేదా షాంపైన్ సీసా ఉండేట్లుగా చూసుకోండి.

ఒక శృంగారభరిత రాత్రితో మీ భర్తని ఆశ్చర్యానికి గురి చేయడమనేది ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన ఆలోచన, అయితే దీని కోసం కొన్ని సన్నాహాలు మరియు రహస్య ప్రణాళికలు ముందుగానే వేసుకోవడం చాలా అవసరం.

No comments:

Post a Comment