Sunday 29 January 2017

అనార్కలీకి ఎత్తు చెప్పులే జోడీ!

అనార్కలీకి ఎత్తు చెప్పులే జోడీ!
వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి, చూడ్డానికి బాగుంటాయి కాబట్టి ఎక్కువమంది అమ్మాయిలు చీరలూ, వెస్ట్రన్‌ రకాలకంటే కుర్తీలకే ఎక్కువగా ఓటేస్తుంటారు. కానీ వీటిని ధరించేటప్పుడు చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. అవి చేయకుండా ఉంటే ఇంకా అందంగా మెరిసిపోవచ్చు..
కుర్తీల్లో సింథటిక్‌ రకాలకంటే... నూలు, లినిన్‌ తరహావి మంచివి. ఇవి శరీరానికి తగినంత ప్రాణవాయువుని అందిస్తాయి. లేకపోతే కుర్తీలపై చెమట మరకలు పడి రంగు వెలిసి అందం కోల్పోతాయి.
పొడవుగా, సన్నగా కనిపించాలనుకున్నప్పుడు మోకాళ్లు దాటిన పొడుగాటి కుర్తాలని ఎంచుకోవాలి.
నేలకు జీరాడినట్టుండే అనార్కలీలు ఇప్పటి ట్రెండు. అయితే పొడుగ్గాలేని వాళ్లు వీటిని ధరించడానికి వెనకాడతారు. కారణం ఇంకా పొట్టిగా కనిపిస్తామేమో అన్న భయంతో. కానీ తగిన హీల్స్‌ వేసుకుంటే ఈ అనార్కలీలను భేషుగ్గా ప్రయత్నించవచ్చు.
లైనింగ్‌ ఉన్న కుర్తీలు వేసుకుంటే లోపలి స్లిప్‌లు(లోదుస్తులు) బయటకు కనిపిస్తాయన్న చింత ఉండదు.
చుడీదార్‌ లేదా కుర్తాల విషయంలో చేతుల ఎంపిక కూడా కీలకమే. స్లీవ్‌లెస్‌, మెగా స్లీవ్స్‌, నిండు చేతులూ, త్రీఫోర్త్‌ ఉండేవాటిని శరీర ఆకృతిని బట్టి ఎంచుకోవాలి. కొందరికి చేతులు చాలా లావుగా ఉంటాయి. అటువంటి వారికి మెగాస్లీవ్స్‌, స్లీవ్‌లెస్‌ వంటివి అంతగా బాగుండవు. చేతులు పెట్టించుకోవాలి. అదీ నెట్‌, షిఫాన్‌, జార్జెట్‌ రకాల్లో అయితే బాగుంటుంది.

No comments:

Post a Comment