Wednesday 1 February 2017

అప్పుడు నొప్పి రాకుండా..

అప్పుడు నొప్పి రాకుండా..
నెలసరి ఆలస్యంగా రావడం ఒక సమస్య అయితే.. ఆ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పి మరొక సమస్య. నెలసరి సక్రమంగా రావడానికీ, నొప్పి తగ్గడానికీ ఏం చేయాలో చూద్దాం!
క చిన్నచెంచా వాముని కప్పు నీళ్లలో మరిగించి అందులో కాస్త బెల్లం వేసుకుని తాగి చూడండి.
వారం రోజులు ముందు నుంచీ పచ్చిబొప్పాయి ముక్కలు తినడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
నెలసరి రావడానికి నాలుగైదురోజుల ముందు నుంచీ అల్లం టీని తాగాలి. లేదంటే అల్లాన్ని దంచి నీటిలో మరిగించి తేనెతో కలిపి అల్లంటీలా తాగినా మార్పు కనిపిస్తుంది. లేదంటే ధనియాల టీ తాగొచ్చు. దీనివల్ల నెలసరి ఆలస్యం కాకుండా ఉంటుంది. దానివల్ల ఆ సమయంలో నొప్పి కూడా వేధించదు.
వారంరోజుల పాటూ దానిమ్మ రసాన్ని గ్లాసుడు చొప్పున తాగాలి. ఇలా ఓ పదిహేనురోజులపాటూ తాగి చూడండి. నెలసరి సమయంలో పొట్టలో మెలితిప్పినట్టుగా కావడం, కడుపులో వికారం వంటి సమస్యలు ఉండవు. దానిమ్మ రసాన్ని అలానే తాగలేం అనుకునేవారు చెరకు రసంతో కలిపి తీసుకోవచ్చు.

No comments:

Post a Comment