Wednesday 1 February 2017

వ్యాయామం చేయలేకపోతున్నారా!

వ్యాయామం చేయలేకపోతున్నారా!
అధికబరువుని తగ్గించుకోవాలనీ, అనారోగ్యాలకు దూరంగా ఉండాలనీ చాలామంది వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ దాన్ని ఆచరణంలో పెట్టడంలోనే విఫలమవుతుంటారు. మీ సమస్య కూడా అదే అయితే ఇలా చేసి చూడండి.
వ్యాయామం అంటే మొదటి రోజే కిలోమీటర్ల కొద్దీ నడవడం, పరుగులు తీయడం ఒళ్లు నొప్పులు పుట్టేట్లు బరువులెత్తడం కాదు. దానికి అలవాటు పడేలా మీ శరీరాన్ని మార్చుకోవాలి. అంటే జీవనశైలిని వ్యాయామానికి అనుగుణంగా చేసుకోవాలి. మొదట సరైన నిద్రాహారవేళల్ని పాటించండి. అప్పుడే పొద్దున్నే నిద్రలేవగలరు. చురుగ్గానూ వ్యాయామం చేయగలరు.
మీ దినచర్యలో వ్యాయామాన్ని ఓ భాగం చేయండి. అంటే ఇంటిపనుల్లో మీ అమ్మకు సాయం చేయండి. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా మీ అల్మారాను సర్దుకోండి. ఎతైన అరల్లో ఉన్నవాటిని తీసి ఎప్పటికప్పుడు సర్దడం కూడా వ్యాయామంలో ఓ భాగమే. అంతేకాదు మునివేళ్లపై నిలబడి రెండు చేతుల్నీ పైకెత్తి వాటిని తీసి సర్దడం వల్ల శరీరమంతా రక్తప్రసరణ సజావుగా సాగుతుంది.
వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇంట్లో చేయడం వల్ల బద్ధకం రావచ్చు. అలా కాకుండా దగ్గర్లోని యోగా కేంద్రం, జిమ్‌ లాంటిచోట్ల చేరండి. పార్కుకు వెళ్లి వ్యాయామం చేయడం వల్ల మీ సమయం కూడా సద్వినియోగం అవుతుంది.

No comments:

Post a Comment