Wednesday 1 February 2017

అలంకరణ చెదరకుండా..

అలంకరణ చెదరకుండా..
ఉదయం గీతగీసినట్టుగా పొందిగ్గా పెట్టుకున్న కాటుక సాయంత్రం వరకూ అలానే ఉండాలనేం లేదు. కాసేపటికే చెదిరిపోతుంది. ఒక్క కాటుకతోనే ఈ సమస్య కాదు... లిప్‌స్టిక్‌, ఐలైనర్‌ వంటివన్నీ అలంకరించుకున్న కాసేపటికే చెదిరిపోతుంటాయి. దీన్నే స్మడ్జింగ్‌ అంటూ ఉంటాం. అలా కాకుండా వేసుకున్న మేకప్‌ వేసుకున్నట్లుగా ఉండాలంటే..
ప్రైమర్‌ అంటే ప్రాథమిక అలంకరణ వస్తువు. కంటి అలంకరణ చేసుకోవడానికి మందు అంటే ఐలైనర్‌ వేస్తుంటే ఆ ముందు ప్రైమర్‌ని కచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్‌స్టిక్‌ని ప్రయత్నించేవారూ ప్రైమర్‌ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. ప్రైమర్‌ వేసి ఆపై అలంకరణ చేసుకుంటే అది సాయంత్రం వరకూ చెదరకుండా ఉంటుంది.
కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా అక్కడ పౌడర్‌ని వేసినా ఉపయోగం ఉండదు. కాసేపటికీ ఆ పౌడర్‌ తొలగి నలుపు కనిపిస్తుంది. అందుకని ముందుగా కన్సీలర్‌ వేసుకుని పౌడర్‌ అద్దుకోవాలి.
చాలామందికి మ్యాటీ తరహా లిప్‌స్టిక్‌ అంటే చాలా ఇష్టం. అంటే లిప్‌గ్లాస్‌ మాదిరిగా కాకుండా కాస్త గరుకుగా కనిపిస్తుందిది. కానీ వేసిన కాసేపటికే చెరిగిపోవడం దీని లక్షణం. అలా కాకుండా ఉండాలంటే... ముందుగా పెదాలపై పేరుకున్న మృతకణాలని తొలగించి కొద్దిగా లిప్‌బామ్‌ రాయాలి. అదనంగా ఉన్న బామ్‌ని టిష్యూతో తుడిచి ఆపై లిప్‌లైనర్‌ వేసి ఆ మధ్యలో మ్యాటీలిప్‌స్టిక్‌ని నింపాలి. ఒకసారి టిష్యూతో తుడిచి ఆపై మళ్లీ వేయాలి. ఇలా అయితే చెక్కు చెదరకుండా ఉంటుంది.
కొద్దిగా హెయిర్‌స్ప్రేని టూత్‌బ్రూష్‌పై తీసుకుని దానితో కనుబొమల్ని దువ్వుకోవాలి. అవి రోజంతా చెదరకుండా ఉంటాయి.

No comments:

Post a Comment