Saturday 28 January 2017

సరికొత్త పార్టీవేర్ బ్లౌస్ డిజైన్స్ పొందాలనుకుంటే..!


అందం..అలంకారం.. అంటే ఇష్టపడని అతివలుండరు. అదీ ప్రత్యేకమైన రోజుల్లో అదీ ఫంక్షన్లు, పార్టీలు వస్తే ఇక ఆ హడావుడి చెప్పనవసరం లేదు. ఎన్నో శారీలను, బ్లౌస్ లను ముందు వేసుకుని డైలమాలో పడతారు. అంతేకాక ఈ రోజుల్లో ఎన్ని డిజైన్స్ కొత్తవి వేసుకుంటే అంత అందం ఆకర్షణ ఆ పార్టీలో వస్తుంది. అందరి అభిరుచీ ఈ బ్లౌస్ ల విషయంలో ఒకటేలా ఉండవు. అంతేకాక మన స్నేహితులు, పక్కవారిలో ఈ రకరకాల డిజైన్స్ తో వెరైటీగా కనిపించటం వల్ల మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే మా తెలుగు టిప్స్ పాఠకులకు అదీ అతివలకూ సరికొత్త బ్లౌస్ డిజైన్స్ లను అందిస్తున్నాం మీకోసం..అవేంటో చూద్దామా..

నెక్ బ్లౌస్ డిజైన్

Neck-blouse-design-for-party-wear1-362x483
ఆరంజ్ రంగు షిఫాన్ ట్రెండింగ్ బ్లౌస్ తో నలుపు రంగు మధ్యలో ఉండటం వల్ల అది చాలా అందంగా కనపడుతుంది. అదే మీకు ఆరెంజ్ రంగు మీకు ఇష్టం లేకపోతే పూర్తి నలుపు రంగు బ్లౌస్ వాడవచ్చు. అయితే దీనికి లైట్ కలర్ శారీ పసుపు రంగు బోర్డర్ వేసుకుంటే కాంట్రాస్ట్ గా ఉంటుంది.

పార్టీలకు సరికొత్త డిజైన్ బ్లౌస్

Blouse-design-for-party-wear
మంచీ బ్లౌస్ తెలుపు ఎంబ్రాయిడరి వర్క్ తో లొ-నెక్ తో ఉండే బ్లౌస్ అన్ని వయస్సుల వారికీ సరిపడుతుంది. ఆకర్షణీయంగా కనపడుతుంది. ఎందుకంటే పార్టీ అంటే ఏదైనా చక్కగా కనిపించేలా ఉండటమే. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వల్ల నిగనిగలాడుతూ కనపడతారు.

పడవ మెడ బ్లౌస్ డిజైన్

Boat-neck-blouse-design
ఇప్పుడు మంచి ఫాస్ట్ గా ఉన్న డిజైన్ కలక్షన్స్ లో పడవ మెడ డిజైన్ బాగా ఉంది. ఒక ట్రన్స్పరెంట్ బ్లౌస్ కు ఆరంజ్ కలర్ ఫ్లవర్లతో కూడిన ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. ఈ బ్లౌస్ కు వెనుక వైపు పడవ ఆకారంలో కట్ వస్తుంది. అంతేకాక పార్టీవేర్ గా మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే పైన ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ట్రన్స్పరెంట్గా వచ్చి మధ్యలో త్రికోణాకారంలో కట్ వచ్చి మిగతా బ్లౌస్ అంతా తెల్లటి మెటీరీయల్తో స్లీవ్ లెస్ వస్టుంది. దీనివల్ల శరీరానికి ఫిట్ అయ్యి కనిపించి మంచి ఆకర్షణీయంగా కనపడుతుంది.

కలర్ నెక్ పార్టీ వేర్ డిజైన్ బ్లౌస్

Latest-blouse-design-for-party-wear-4
మీరు పార్టీ కి సరికొత్తగా వెళ్ళాలనుకుంటే బ్లాక్ కలర్ నెక్ బ్లౌస్ ను ఎంచుకొండి. స్లీవ్ లెస్ జాకెట్టు మోడల్ దీనికి బాగా నప్పుతుంది. కాబట్టి మీరు దానిని వేసుకుని వెళ్ళండి. అంతేకాక మరో స్లీవ్ లెస్ బ్లాక్ నెక్ బ్లౌస్ ఇక్కడ మీరు చూడవచ్చు. దీని బ్లౌస్ చుట్టు ఉన్న సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ ని ఎంతో ఆకర్షణీయంగా కనపడుతుంది.

లేటెస్ట్ బ్లౌస్ డిజైన్

Latest-blouse-design
మీ పార్టీ లో ఆకర్షణీయంగా అంతేకాక బాగా సాంప్రదాయంగా కనిపించాలంటే మీరు సాంప్రదాయ బ్లౌస్ ను ఎంచుకోండి. ఆకుపచ్చ బ్లౌస్ పై చుట్టు గులాబీ రంగు జరీ వర్కుతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బ్లౌస్ చేతులు దాదాపు మోచేతి దాకా ఉండి ఎంతో అందంగా కనపడతారు.

లోనెక్ బ్లౌస్ డిజైన్

Low-neck-blouse-design-for-party-wear
లోనెక్ బ్లౌస్ లు ఈ రోజుల్లో పార్టీలకు వేసుకోవటం సహజం అయిపోయింది. లేడి బ్లాక్ కలర్ షిఫాన్ శారీ లో చుట్టు గోల్డ్ కలర్ బోర్డర్ లేదా సిల్వర్ అలాగే రెడ్ కలర్ మధ్యలో వచ్చి అంతేకాక రెడ్ లేసులు ఉండి ఎంతో ఆకర్షణీయంగా కనపడుతుంది. అంతేకాక లోనెక్ రావటం వల్ల ఎంతో అందంగా కనపడుతుంది. దీనికి చేతులు కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది.

ట్రెండీ బ్లౌస్ డిజైన్Trendy-blouse-design-for-party-wear-300x300

ఈ బ్లౌస్ మిగతా బ్లౌస్ ల కంటే ఎంతో వైవిధ్యంగా కనపడుతుంది. అంతేకాక మధ్యలో పడవ కట్ రావటం ఇంకా ఆకర్షణీయంగా కనపడుతుంది. అంతేకాక దీనికి కింద చివరిలో పింక్ కలర్ క్లాత్ వచ్చి ఎంతో బాగుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది డిజైనర్ శారీ.

హెవీ వర్క్ డిజైన్ బ్లౌస్Latest-blouse-design-for-party-wear-8

ఈ బ్లౌస్ పొడవాటి చేతులతో పూర్తిగా మెడవరకూ కవర్ చేసి ఉంటుంది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే దీనికి ఎంబ్రాయిడరీ గోల్డ్ కలర్తో భారీగా మెడ చుట్టూ అలాగే కింద వరకూ ఉండి ఎంతో అందంగా కనపడటమేకాక మీ అందమూ పెరుగుతుంది.

వెల్వెట్ బ్లౌస్Latest-blouse-design-for-party-wear-9-300x234

ఈ బ్లౌస్ పార్టీలలో వేసుకుంటే ఎంతో డేషింగ్ గా కనపడుతుంది. ఈ జాకెట్టుకి ముందు భాగం లో కప్స్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ తో వచ్చి ఎంతో అందంగా ఉంటుంది.అంతేకాక వెనుక భాగంలో రెండు నాట్లు(knots) వస్తాయి.

వర్క్ బ్లౌస్ డిజైన్Work-blouse-design-for-party-wear-293x300

బొమ్మలో చూపిన మోడల్ వేసుకున్నట్ట్లుగా స్కర్ట్ స్టైల్ శారీ పైన పీచ్ కలర్ డిజైనర్ బ్లౌస్. ఇది వేసుకుని మీ మిత్రుల్ని ఆశ్చర్య పరచవచ్చు.

సరికొత్త స్లీవ్ బ్లౌస్ డిజైన్Sleeve-latest-blouse-design-for-party-wear

గుడి స్టైల్ డిజైన్ తో తెలుపు, నలుపు రంగులో డిజైన్ ఎంతో బాగుంటుంది అంతేకాక ఈ బ్లౌస్ ప్రత్యేకత ఏంటంటే ఇది డబల్ లేయర్ ను కలిగి ఉంటుంది. ఒకటి కింద ఎరుపు రంగులో ప్రింట్లు మొత్తం ఉంటుంది. మరొకటి వెల్వెట్ క్లాత్ పైన ఓవర్ లాపింగ్ తో రెడ్ కలర్ తో ఉంటుంది. చక్కటి బోర్డర్ తో నెక్ అలాగే స్లీవ్ లెస్ వస్తుంది.

నెట్ చేతుల బ్లౌస్Latest-blouse-design-for-party-wear-12

ఇది పార్టీకి చాలా అనుకూలమైన డిజైన్. ఇది షిఫ్ఫాన్ శారీ పై చాలా ఆకర్షణీయం గా కనపడుతుంది. లైట్ ఆరెంజ్ కలర్ వేసుకున్న మోడల్ ను పరిశీలిస్తే నెట్టెడ్ షార్ట్ స్లీవ్ లతో ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ.. బోర్డర్ బాగా పెద్దగా చక్కగా ఉంటుంది. ఇది ఏ పార్టీ లోనైనా అలాగే అకేషన్ లోనైనా వేసుకోవచ్చు.

లేస్ బ్లౌస్ డిజైన్Latest-blouse-design-for-party-wear-13

ఈ బ్లౌస్ పూర్తిగా డిజైనింగ్ వర్క్ తో కూడుకున్నది. లేస్ వర్క్ తో పూర్తిగా నెక్ నుంచీ కిందవరకూ ఉంటుంది. అంతేకాక చివర క్లాత్ వచ్చి బ్లౌస్ ఫినిషింగ్ ఉంటుంది. దీనిలో ప్రత్యేకత ఏంటంతే లేస్ వర్క్. ఆఖరుకి స్లీవ్స్ కూడా లేస్ వర్క్ తో వచ్చి చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది.

లేటెస్ట్ బ్లౌస్ డెజైన్Latest-blouse-design-for-party-wear-683x1024

సరికొత్త డిజైన్ లలో భాగంగా ఈ బ్లౌస్ ను ఉంచవచ్చు. ఎందుకంటే ఈ బ్లౌస్ మెడ చుట్టు డిజైనింగ్ వర్క్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. అంతేకాక చేతుల వద్ద కూడా వర్క్ వచ్చి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

డీప్ నెక్ బ్లౌస్ డిజైన్Latest-blouse-design-for-party-wear-15

ఈ డిజైన్ ను సెక్సీ సింబల్ గా చెప్పుకోవచ్చు. పొట్టి చేతుల తో ఎంతో ఆక్షర్షణీయంగా ఉంటుంది .మీ పార్ట్నర్ ను ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇది వేసుకోండి.. తప్పక ఎంతో అందంగా కనిపిస్తారు. పార్టీ లో మొత్తం ప్రధాన ఆకర్షణగా నిలవాలంటే ఇదో బ్లౌస్ డిజైన్. ఎంతో ఆకర్షణీయంగా కనపడవచ్చు. ఈ డిజైన్ పచ్చ అలాగే నీలి రంగు చీరలపై వాడితే ఎంతో బాగుంటుంది.

హాల్ఫ్ స్లీవ్ బ్లౌస్ డిజైన్Half-sleeves-blouse-design-for-party-wear

మీరు చూస్తున్న లేడీ వేసుకున్న లెహంగా డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా కనపడుతుంది. అంతేకాక ఈ బ్లౌస్ క్లాత్ గ్లాస్ మోడల్ క్లాత్ అంతా ట్రాన్స్పెరెంట్ గా ఉంది దానిపై వర్క్ వచ్చి ఎంతో బాగుంటుంది. ఇది సాధారణంగా కొత్త పెళ్ళి కూతుర్ల కు ఎంతో బాగుంటుంది.

పూసల డిజైన్ బ్లౌస్Latest-blouse-design-for-party-wear-17

ఈ బ్లౌస్ మోడల్ ఇప్పుడు మార్కెట్లో బాగా అమ్ముడవుతూన్న డిజైన్. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బ్లౌస్ చుట్టూ అంటే బ్లౌస్ వీపు భాగంలో పూసలతో డయాగ్నల్ గా అంటే వికర్ణంగా పూసల వర్క్ చేసి ఉంటుంది. పర్పుల్ రంగు బ్లౌస్ కలర్ బ్లౌస్ పై ఈ వర్క్ ఎంతో బాగుంటుంది. దీనికి లేసులు సమాంతరంగా వేసి ఉండి స్ట్రిప్స్ ఎంతో అందంగా కనపడతాయి.

ఫ్లవర్ వర్క్ బ్లౌస్ డిజైన్Flower-work-blouse-design-for-party-wear-300x225

ఈ బ్లౌస్ ప్రత్యేకత ఏంటంటే బ్లౌస్ ముందు పై భాగంలో పూల డిజైన్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అంతేకాక ఈ బ్లౌస్ భుజాల మీద వచ్చిన వర్క్ చాలా అందంగా ఉంటుంది.

సింపుల్ బ్లౌస్ డిజైన్Simple-blouse-design-for-party-wear-300x300

ఈ బ్లౌస్ లైట్ కలర్ చీరపై అలాగే లైట్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చి ఎంతో ఆకర్షణీయంగా కనపడుతుంది. అంతేకాక ఏ లైట్ కలర్ పైన అయినా నలుపు రంగుతో వర్క్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మీరూ ఈ వర్క్ ప్రయత్నించవచ్చు.

బ్లౌస్ డిజైన్Blouse-design-for-party-wear1-300x300

ఇది చాలా సాధారణంగా ఉండే మంచి డిజైన్. మీకు కృత్రిమ రూపు రాకుండా నేచురల్ గా ఎంతో ధైర్యంగా ఉండేలా చేస్తుంది. రెడ్ శారీ పై దానికి తగ్గట్టుగా మేచ్ అయ్యేలా ఉంటే ఆ వైవిధ్యాన్ని మనం చూడవచ్చు.

వర్క్ బ్లౌస్ డిజైన్Work-blouse-design-for-party

ఇది పింక్ కలర్ బ్లౌస్ పై చక్కటి పువ్వు ఎంబ్రాయిడరీ వచ్చి ఎంతో అందంగా ఉంటుంది. ఈ బ్లౌస్ స్లీవ్ లెస్.

No comments:

Post a Comment