Friday 27 January 2017

వాళ్లని అన్‌ఫ్రెండ్‌ చేయాలి!

వాళ్లని అన్‌ఫ్రెండ్‌ చేయాలి! 
ఫేస్‌బుక్‌లో కొందరు ఏదో ఒక వర్తమాన వ్యవహారాన్ని పోస్ట్‌ చేసి దాని గురించి చర్చ మొదలుపెడతారు. లేదా మనం చేసిన పోస్ట్‌ గురించి వాదన ప్రారంభిస్తారు. అలాంటివి చూసినప్పుడు మనకూ స్పందించాలనిపిస్తుంది. దానివల్ల సమయం వృథా తప్ప మరేమీ ఉండదు. పైగా లేని పోని వాదనలు మనసు మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే అలాంటి వారు మీ ఖాతాలో ఉంటే తొలగించండి.
కొందరు కావాలని మనకు తెలిసిన వారి పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరుస్తుంటారు. తరచూ ‘వహ్వా’ అంటూ అభినందనలు చెబుతుంటారు, ఛాటింగ్‌కి వస్తుంటారు. అతిగా ప్రవర్తించే అలాంటి వారిని గుర్తిస్తే వెంటనే వారెవరో తెలుసుకోవాలి. లేదంటే... స్నేహితుల జాబితా నుంచి తొలగించాలి.
మరికొందరు మన దగ్గరి స్నేహితులే కావచ్చు... తమ ఖాతాలో రకరకాల వీడియోలూ, అసభ్య చిత్రాలున్న సైట్‌లను పోస్టు చేస్తుంటారు. కొన్నిసార్లు మనకీ ట్యాగ్‌ చేస్తుంటారు. ‘కొందరి తీరంతే’ అని వూర్కోవడం వల్ల మనల్ని ఎదుటివారు తప్పుగా అర్థంచేసుకునే ప్రమాదం ఉంది
కొందరు తమ సామాజికవర్గానికి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. అందులో మనల్నీ ట్యాగ్‌ చేస్తుంటారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన ప్రమేయం లేకుండానే మిగతావారికి దూరమయ్యే ప్రమాదముంది!!

No comments:

Post a Comment