Friday 27 January 2017

వేధింపులు నివారించేలా..

వేధింపులు నివారించేలా..
న్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొనేవారి కోసం ఫేస్‌బుక్‌ సరికొత్త ‘టూల్‌’ని ప్రవేశపెట్టింది! ఇది కేవలం ఆన్‌లైన్‌ ఆకతాయిలకి అడ్డుకట్ట వేయడానికే పరిమితమయ్యే ఉపకరణం కాదు. ఈ సమస్యకు కారణాలూ, నివారణ మార్గాలూ, వాటిని ఎదుర్కొనే పద్ధతులూ అన్నీ సమగ్రంగా ఉంటాయి ఇందులో. ‘బుల్లీయింగ్‌ ప్రివెన్షన్‌ హబ్‌’(బీపీహెచ్‌) అన్నదే ఈ టూల్‌ పేరు. ఫేస్‌బుక్‌లోని సపోర్ట్‌ ఇన్‌బాక్స్‌లో ఇప్పటికే ఉన్న ‘సేఫ్టీ సెంటర్‌’లో దీన్ని గత సోమవారమే ఏర్పాటు చేశారు. యువత, తల్లిదండ్రులూ, విద్యాసంస్థలు.. వేర్వేరుగా ఏరకంగా వేధింపులని నివారించవచ్చో వివరించారు. ఫేస్‌బుక్‌ తమ ఖాతాదారులకి కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్ల గురించీ ఇందులో ఉంటుంది. బీపీహెచ్‌ మూడేళ్లకిందటే అమెరికాలో మొదలైంది. యేల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘యేల్‌ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌’ సంస్థ సహకారంతో నడుస్తోంది. ఫేస్‌బుక్‌ ఈ కేంద్రం సాయంతో 50 స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటోంది. బుల్లీయింగ్‌ నివారణకి ఆ సంస్థల సూచనలు ఇందులో పొందుపరిచింది. ఈ సూచనల్ని ఆంగ్లంలో మాత్రమే కాదు.. తెలుగుసహా యాభై భాషల్లో చదవొచ్చు.

No comments:

Post a Comment