Saturday 28 January 2017

చంకల్లో దుర్వాసన తొలగించుకోవాలంటే?


చంకల్లో చెమటవాసన వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలన్న ఎంతో బిడియంగా ఉంటుంది..ఆఫీస్ లోనూ..అదేవిధంగా సన్నిహితుల దగ్గరా..ఇలా పలుచోట్ల ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు. అయితే ఈ సమస్యకు కాస్త ఉపసమనం కలిగేందుకు..అదే మన పరిభాషలో చెప్పాలంటే కాస్త కవర్ చేసేందుకు ఉండనే ఉన్నయ్ పర్ఫ్యూం లు అలాగే డియోడరెంట్లు అయినా వీటితో పూర్తిగా రోజంతా చంకలలో చెమట వాసనను ఆపగలమా అనే ప్రశ్న వేసుకుంటే సమధానం శూన్యమే..ఈ చమట వాసన కారణంగా మన బంధువులూ, స్నేహితులూ మనల్ని దూరం పెడతారు. ఈ సమస్యకి కారణం బ్యాక్టీరియా..ఈ సమస్యను నుంచీ ఎలా బయటపడాలి అంటే అందుకు కొన్ని సహజసిద్ధ గృహచిట్కాలు ఉన్నాయి..వాటినీ మీకోసం అందిస్తున్నాం.. అవేంటో చూద్దమా..

వంట సోడా

మన ఇంట్లో దొరికే వంటసోడాతో ఈ చమట దుర్వాసన నుంచీ బయటపడవచ్చు. వంటసోడా మిశ్రమాన్ని తీసుకుని దానికి నిమ్మకాయ రసాన్ని కలిపి బాగా మిశ్రమంగా కలుపుకోవాలి. దీనిని డైరెక్ట్గా చంకల్లో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 15 నిముషాలకు అది ఆరిపోతుంది. తరువాత నీటితో కడుక్కోవాలి. అలాగే ఈ మిశ్రమానికి కావాలంటే మొక్కజొన్న పిండినీ కలుపుకోవచ్చు.  అంతేకాక నిమ్మకాయ బదులు నీరుని ఉపయోగించుకోవచ్చు. పైన చెప్పిన విధానాన్నే అవలంబించవచ్చు.

నిమ్మకాయ

నిమ్మలో చాలా గుణాలున్నాయ్. అందుకే సహజసిధ్ధమైన యాసిడ్ అంటే నిమ్మ అని చెప్పవచ్చు. ఇది ఎంతటి బ్యాక్టీరియానైనా చంపే శక్తి కలది. అంతేకాక ఈ దుర్వాసనను పోగోట్టగలదు. నిమ్మను రాయటం వల్ల ఎంతో తొందరగా ఈ దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. మీకు నిమ్మ చుక్కలు కర్రెక్ట్ గా చంకలపై పడని పక్షంలో మీరు నిమ్మకాయ రసాన్ని ఓ బౌల్ లో పిండి ఆ రసాన్ని తీసుకుని దూదిని తీసుకుని ఆ రసంలో ముంచి రాసుకోవచ్చు లేదా స్ప్రే బాటిల్ ను ఉపయోగించి రాసుకోవచ్చు. ఆరిపోయాక స్నానం చేస్తే మీకు మంచి తేడా కనపడుతుంది.

రోజ్  వాటర్

రోజ్ వాటర్ దుర్వాసనపై ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది దీర్ఘకాలం ఉపయోగించవచ్చు. ఇక అలాగే దీనిని కాటన్ బాల్స్ సాయంతో చంకలలో రాసుకోవాలి. కుదరని పక్షాన స్ప్రే బాటిల్ ద్వారా రాసుకోవచ్చు. అంతే కాక రోజ్ వాటర్ ను బాత్ టబ్లో వేసుకుని స్నానం చేసుకోవచ్చు.

సాండల్వుడ్ పవ్డర్

సాండల్ వుడ్ పవ్డర్ దుర్వాసనను తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు చంకలలో దుర్వాసనన రాకుండా ఇది పరిరక్షిస్తుంది. గంధం పొడి సులభంగానే మార్కెట్లో దొరుకుతుంది. గంధమ్ను కొని దానిలో నీటిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చంకలలో రాసుకోవాలి. వెంటనే కడుగ రాదు. కాసేపు అలాగే ఉంచుకోవాలి. తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. సబ్బును వాడవద్దు. ఇంకా బాగా మంచి సత్ఫలితాలు పొందాలంటే ఆ మిశ్రమానికి నీటికి బదులుగా వెనిగర్ ను వాడితే మరింతా బాగా పలితాలొస్తాయి. కానీ ఈ మిశ్రమాన్ని మాత్రం స్నానం అయ్యకే రాసుకోవాలి. తరువాత దుర్వాసన పోయి చక్కని పరిమళం మన శరీరం నుంచీ రావటం మీరు గుర్తిస్తారు.

హెర్బల్ మిశ్రమాలు/ మూలికా మిశ్రమాలు

చంకల్లో దుర్వాసన తొలగించేందుకు చాలా హెర్బల్ మిశ్రమాలు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. వీటిలో వాల్నట్ ఆకులు, యూకలిప్టస్ ఆకులు, టోర్మింటల్ ఆకులు, ఓక్ ఆకులు, లేత గోధుమ రంగు ఆకులు వీటిని బాగుగా కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ ఆకుల్ని బ్రేక్ చేయకుండా 5 టీస్పూన్ల మిశ్రమాన్ని రెండు లీటర్ల నీటితో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగుగా 5 నిముషాల పాటు ఉడకపెట్టుకోవాలి. ఈ మిశ్రమం ఖచ్చితంగా చంకల్లో దుర్వాసన పోగెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని రోజూ స్నానానికి ముందు చేసుకోవటం చాలా ఉత్తమం.
పైన తెలుపిన సహజసిధ్ధ గృహ చిట్కాల వల్ల ఖచ్చితంగా చంకల్లో దుర్వాసన పోయి సత్ఫలితాలను పొందవచ్చు. వీటివల్ల పూర్వపు దుర్వాసన పోతుంది.

No comments:

Post a Comment