Friday 27 January 2017

వాళ్లతో జాగ్రత్త..Beware women at internet

వాళ్లతో జాగ్రత్త..
ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌.. ఇలా ప్రతి సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉండాలనుకుంటున్నారు అమ్మాయిలు. పరిచయాలు పెంచే ఈ వేదికలు కొన్నిసార్లు సమస్యలూ తెచ్చిపెడతాయి. అందుకే స్నేహం చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
* సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యక్తులే కాదు.. మారు పేర్లతో నకిలీ ఖాతాలను ఏర్పరుచుకునే మోసగాళ్లూ ఉంటారు. అందుకే ఎవరిని పడితే వారిని మీ పేజీలూ, ఖాతాలకు ఆహ్వానించకండి. మీరు తెలిసిన వ్యక్తుల్నే స్నేహితులుగా అంగీకరించండి. ఎవరి ఖాతాలైనా అంగీకరించే ముందు ఒకటికి రెండుసార్లు వారి గురించి తెలుసుకోండి.
* అపరిచితుల నుంచి పదే పదే వచ్చే సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయనుకున్నప్పుడు గోప్యతా రక్షణ అంశాలను (ప్రైవసీ సెటింగ్‌)లని ఉపయోగించండి. సంబంధిత మాధ్యమ నిర్వాహణా సంస్థకి ఫిర్యాదు చేయడం, నిషేధించడం (బ్లాక్‌) చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు.
* మీ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉన్నవారు ఎంత స్నేహితులయినా మీ బలహీనతలు పంచుకోకండి. వ్యక్తిగత ఫొటోలు పంపకండి. వాటిని ఉపయోగించి ఇతరులు మిమ్మల్ని బెదిరించే ప్రమాదమూ లేకపోలేదు!

No comments:

Post a Comment