Friday 27 January 2017

తీరైన శరీరానికి ప్లాంక్‌

తీరైన శరీరానికి ప్లాంక్‌

ప్లాంక్‌... ఈ మధ్య తరచూ వినిపిస్తున్న పదం. తక్కువ సమయంలోనే శరీరంలోని ప్రతి అవయవానికీ వ్యాయామం అందించి... శరీరాన్ని తీరైన ఆకృతిలోకి మార్చే కసరత్తు ఇది.
ల్బో ప్లాంక్‌.. బోర్లాపడుకుని కాలివేళ్లపై భారం ఉంచి, మోచేతులపై బరువుని వేసి శరీరాన్ని పైకి లేపాలి. ఇలా అరనిమిషం పాటూ ఉండాలి. కొన్ని సెకన్లపాటూ విశ్రాంతి తీసుకుని ఇప్పుడు ఫుల్‌ ప్లాంక్‌లోకి రావాలి. అంటే భారాన్ని మోచేతులపై కాకుండా అరచేతులపై వేసి శరీరాన్ని మరికాస్త పైకి లేపాలి. తలను పైకి పెట్టి చూడాలి. ఇలా అరనిమిషం పాటూ ఉండాలి. ఆ తర్వాత అరనిమిషం పాటూ విశ్రాంతి తీసుకుని ఈ సారి ఒక పక్కకు అంటే ఒక చేతిపై భారం వేసి అరనిమిషం పాటూ ఉండాలి. ఈ ప్లాంక్‌ వ్యాయామాల్ని రోజూ చేయడం వల్ల దీనివల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు తగ్గి కండరాలు బలపడతాయి. చిన్నచిన్న బరువులకే అలసిపోయే సమస్య ఉండదు. వెన్నెముకకు గాయాలయ్యే పరిస్థితి ఎదురుకాదు. మందగించిన జీవక్రియల వేగం తిరిగి పుంజుకుంటుంది. మానసిక సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఏ వ్యాయామం చేయడానికయినా శరీరం అనువుగా మారుతుంది. ముఖంలోకి రక్తప్రసరణ జరిగి యాక్నె తగ్గుతుంది.

No comments:

Post a Comment