Friday 27 January 2017

మీ హక్కులేంటో తెలుసుకోవాలా!

మీ హక్కులేంటో తెలుసుకోవాలా!
అంతర్జాలంలో మనపట్ల ఒకతను అసభ్యంగా ప్రవర్తించాడు. వాడికి తగిన బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలో మీకు తెలియడం లేదు. స్నేహితులతో కలిసి ఓ వేడుకలో పాల్గొంటే అక్కడ ఓ స్నేహితుడి అనుచిత ప్రవర్తన మిమ్మల్ని భాదించింది. కానీ అతన్ని శిక్షించాలంటే ఎలా అనే సందేహం మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇవనే కాదు... డబ్బు విషయంలో, బాంధవ్యాల విషయంలో ఎన్నో న్యాయపరమైన సందేహాలు వస్తుంటాయి. ఆ నిమిషానికి ఏ స్నేహితుల సాయమో తీసుకుంటాం. కానీ న్యాయ సలహాలు కాస్త కొరుకుడు పడని అంశం అనే భావన కూడా మనకి ఉంది. గార్ల్స్‌గాటానో.ఇన్‌ సైటు చూస్తే మాత్రం మీకలా అనిపించదు. ఆస్ట్రేలియాకు చెందిన టస్మానియా విశ్వవిద్యాలయం, మన ప్రభుత్వంతో కలిసి ఆడప్లిలల హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నమే గార్ల్స్‌గాటానో.ఇన్‌ వెబ్‌సైటు. ఇది మహిళలు నిత్యం ఎదుర్కొనే సమస్యలకు తేలిగ్గా న్యాయపరమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. భార్యభర్తల బంధంలో, సహజీవనంలో ఎదురయ్యే సమస్యలు మొదలుకుని ఇళ్లూ, ఇంటి అద్దె, ఉద్యోగంలో వేధింపులూ, ధృవీకరణ పత్రాల్లో ఇంటి పేరు మార్పు వరకూ అనేక విషయాల్లో న్యాయపరమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఆడపిల్లలకు తమ హక్కుల గురించి తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పడమే ఈ సైటు లక్ష్యం అంటున్నారు ఈ ప్రయత్నం వెనుక ఉన్న సుసాన్‌ఫాహే.

No comments:

Post a Comment