Thursday 26 January 2017

పెదవులకు రంగు వేసే ముందు..

పెదవులకు లిప్‌స్టిక్‌ వేసుకుంటే వాటి అందం రెట్టింపు కావాలి. అంటే.. బాగా కొట్టొచ్చినట్టు కనిపించే రంగును పెదవులకు వేసుకోవాలని కాదు. దాన్ని వాడేముందు చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం తెలిసుండాలి.


చాలామంది ముఖంపై చూపించిన శ్రద్ధ పెదవులపై పెట్టరు. దాంతో పెదవుల్లో మృతకణాలు పేరుకుపోతాయి. దానివల్ల లిప్‌స్టిక్‌ వేసుకున్నా పెదవులు పొడిబారతాయి. ఈ సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే వారానికోసారి కొద్దిగా టూత్‌పేస్టులో చక్కెర కలిపి పెదవులపై రుద్దుకుని కాసేపయ్యాక కడిగేయాలి.
ఏదో ఒక రంగు కాకుండా మీ పెదవుల ఆకృతికి సరిపోయే లిప్‌స్టిక్‌ని ఎంచుకోవాలి. అంటే.. మీ పెదవులు పల్చగా, చిన్నగా ఉంటే ముదురు రంగులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ నిండుగా, కాస్త లావుగా ఉంటే.. లేత ఛాయల్ని వాడాలి.
లిప్‌గ్లాస్‌ని రాసుకున్న వెంటేనే లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. పెదవులు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలకు అది చూడ్డానికి కూడా బాగోదు. అందుకే అలంకరణ చేసుకునే ముందే లిప్‌గ్లాస్‌ రాసుకోండి. ఇతర మేకప్‌ అంతా పూర్తయ్యేసరికి అది ఆరిపోతుంది. అప్పుడు లిప్‌స్టిక్‌ వేసుకుంటే సరిపోతుంది.
వేసుకున్న లిప్‌స్టిక్‌ ఎక్కువ గంటలు అలాగే తాజాగా కనిపించాలనుకుంటే.. పెదవులపై టిష్యూని ఉంచి, దానిపై కొద్దిగా పౌడరు చల్లుకోండి. అప్పుడు అదనంగా ఉన్న రంగు ఆ కాగితానికి అంటుకుంటుంది. ఇలా చేయడం వల్ల పెదవులు ఎక్కువసేపు తాజాగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment