ఈ కిటుకులు తెలుసా..
ప్రత్యేక సందర్భాల్లోనే కాదూ.. రోజూ ఎంతో కొంత అలంకరణ చేసుకోవడం కూడా ఇప్పుడు మామూలైపోయింది. మరి మనం చేసుకునే అలంకరణ వల్ల కాస్త యౌవనంగా కనిపించాలంటే ఎలాంటి కిటుకులు పాటించాలో చూద్దాం.
* ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే చర్మానికి సరిపోయే ఫౌండేషన్‌ని గబగబా రాసేసుకుంటారు కొందరు. అంతకన్నా ముందు మీ ముఖానికి కాస్త మాయిశ్చరైజర్ పట్టించండి. లేదంటే ఫౌండేషన్‌లో ఉన్న తేమను మీ ముఖం పీల్చేసుకుని సన్నని ముడతల్లాంటివి ఉంటే కాసేపటికి కనిపిస్తాయి.
* కళ్ల అడుగున నల్లని వలయాలూ, చర్మంపై అక్కడక్కడా ఉన్న మచ్చల్ని కనిపించకుండా చేసేందుకు చాలామంది ఫౌండేషన్‌నే వాడుతుంటారు. కానీ దానికి బదులుగా కన్సీలర్ రాయండి. అవి కనిపించకుండా ఉంటాయి.
* కాస్త పెద్దవారయితే మీరు పౌడర్‌ని వీలైనంత తక్కువగా రాసుకోవాలి. అది ముడతల్లో చేరి, అవి ఇంకా స్పష్టంగా కనిపించొచ్చు.
* పెదవులకు లిప్‌స్టిక్ అంతా రాసుకున్నాక... కొద్దిగా పెట్రోలియంజెల్లీని కింది పెదవి మధ్యలో అద్దండి. దీనివల్ల రంగు ఎక్కువసేపు ఉండటమే కాదు.. పెదవులూ నిండుగా, యౌవనంగా కనిపిస్తాయి.

No comments:
Post a Comment