Saturday 28 January 2017

స్త్రీల అందమైన పెదవులు-వాటి సంరక్షణకు అనువైన చిట్కాలు


స్త్రీల అందమైన పెదవులు-వాటి సంరక్షణకు అనువైన చిట్కాలు


women lip care tips
మన ఈ ప్రస్తుత జీవన శైలిలో ప్రతీ స్త్రీ వారి అందం కొరకు ఎన్నో పద్దతులను ఉపయోగిస్తున్నారు, వారు ఈ కాలంలో మృదువైన, అందమైన పెదవులు కోరుకుంటునారు అనడం కన్నా వాటిపై ఎంతో మక్కువ పెంచుకుంటున్నారు అనడంలో సందేహం లేదు అనే చెపాలి.
సమాన్యంగా స్త్రీ పెదవులు ఎంతో మృదువైనవి, కాని కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, సరైన జాగ్రత్త తీసుకోకపోతే పెదవులు పగలడం, పెదవి పై చర్మం కొంచెం కొంచెం గా ఊడటం, ఎక్కువగా చలి కాలంలో ఇవి ఎంతో బాధకలిగిస్తాయి.

మీ పెదవుల రక్షణకై,కొన్ని చిట్కాలు తెలుకుందామా:

  •  మీ పెదవుల్ని సహజ పద్దతులలో రక్షించుకోవాలంటే, మీ ఇంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం తేనే కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులపై రాయలీ, ఉప్పులోని లక్షణాలు మీ పగిలిన పెదవుల చర్మాన్ని తొలగిస్తుంది, తేనె, మీ పెదవుల్ని తడిగా చేసి, వాటికి కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది.
  •  పొడిగా ఉన్న మీ పెదవుల్ని తడిగా మార్చడానికి ప్రయత్నించకుండా “చాప్ స్టిక్” రాయండి, ఎందుకంటే అది మీ పెదవుల్ని తడిగా మారుస్తుంది అంతే కాకుండా “చాప్ స్టిక్” ని “లిప్ స్టిక్”గా రాసుకుంటూ ఉంటే,మీ పెదవులు పొడిగా అవకుండా మీ పెదవులకు మంచి రక్షణగా ఉంటుంది.
  •  చలి తీవ్రత నుండి, సూర్యుని వేడి నుండి రక్షణ కోసం “విటమిన్ ఈ”ని ఉపయోగించండి.
  • ఎక్కువగా “లిప్ స్టిక్” వాడటం అంత మంచిది కాదు.దీని వల్ల పెదవులు పగిలే ప్రమాదం ఎక్కువ.
  •  కాలం చెల్లిన కీంలు, “లిప్ స్టిక్” లు వాడటం మంచిది కాదు,వీటిలో పొషక పదార్దాలు ఉండక పోగా హాని చేసే క్రిములు ఉండె ప్రమాదం ఎక్కువ.

No comments:

Post a Comment