Saturday 28 January 2017

మీ చర్మసౌందర్యానికి గృహ చిట్కాలు

మీ చర్మసౌందర్యానికి గృహ చిట్కాలు

చాలామంది తమ చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసుకోవాలని తెగ ఆరాటపడతారు..ఇది సహజం..అదీ కాక ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా తమ చర్మ సౌందర్యం పెరగాలని ఆలోచిస్తారు. అయితే మీకు మీ ఇంట్లో మీ బామ్మ చేప్పే చిట్కాల కంటే వేరే వాటికి కూడా వెళ్ళలి అనిపిస్తే..వెళ్ళండి..అదే మన ఆయుర్వేద నిపుణులు గృహ సంబంధ మూలికలు, పదార్ధాలను వాడటం వల్ల ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా మీ చర్మ సౌందర్యం పెరుగుతుందట. కాస్మెటిక్ ఎఫ్ఫెక్ట్స్ అయితే ఎన్నో రకాల సమస్యలొస్తాయి. కానీ ఈ రకమైన సహజసిధ్ధమైనవి వాడటం చర్మానికి కూడా ఎంతో శ్రేయస్కరం. కొన్ని గృహ సంబంధమైన సహజసిధ్ధమైన చిట్కాలను తెలుసుకుందాం.

రసాయనాలకు స్వస్తి పలకండి

తెల్లటి చర్మాన్ని పొందాలని ప్రతి అతివకూ ఉంటుంది. ఎవరికి మాత్రం తెల్లటి చర్మం ఉంటే చక్కగా ఆకర్షించవచ్చని ఎంతో ఆశపడతారు. అయితే మంచి నిగారింపు గల తెల్లటి చర్మం అంత తొందరగా దొరకదు. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు వెనుకాడరు. అయితే ఖర్చు మాట పక్కన పెడితే రసాయనాల దెబ్బకు మీ చర్మం సహజస్తితిని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే రసాయనాలను వాడటం స్వస్తి పలకండి.

సహజసిధ్ధమైన మూలికల్ని వాడటం

మీకు సహజంగా సూర్యుని తాకిడి వల్ల మీ చర్మం చాలా ఇబ్బందులకు గురి అవుతుంది. అదీకాక ప్రత్యేకంగా ఎండాకాలంలో మరింత వేడి తాకిడికి మీ చర్మం బాగా పాడైపోతుంది. అందుకే చాలా మంది అనేక రకాలైన క్రీముల్ని ఆశ్రయించి రాస్తుంటారు. అదీకాక ఎక్కువగా తూర్పు భాగాన ఎక్కువగా వీటిని  వినియోగిస్తున్నారని తెలుస్తోంది. వీటి వల్ల మీ చర్మం మెలనిన్ కోల్పోతుంది. ఎందుకంటే వీటిలో బ్లీచ్, అలోవెరా ఎక్స్ట్రాక్టులు , నిమ్మ ఎక్స్ట్రాక్టులు ఉండటమే కారణం. ఇందువల్ల మీ చర్మానికి చాలా హాని కలుగుతుంది. అందుకే సహజసిధ్ధ మూలికల్ని, పదార్ధ్ధాలని వాడటం ఎంతైనా మంచిది.

కొన్ని సహజసిధ్ధ గృహ చిట్కాలు మీకోసం

తేనె, ఆల్మండ్

చర్మం నిగారింపుకు తేనె, ఆల్మండ్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి చర్మం మిల మిలా మెరిసేలా చేసి జీవం ఉట్టిపడేలా చేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పవ్డర్ తీసుకుని, దానికి 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చక్కగా పేస్ట్ లా చేసుకుని దానిని ముఖానికి వేసుకోవాలి. ఇలా ముఖానికి చక్కగా 10-15 చక్కగా మర్ధనా చేసుకోవాలి.

టొమోటో, ఓట్మీల్

టొమోటో చర్మ సౌందర్యాన్ని పెంచే ఏజెంట్ గా పని చేస్తుంది. టొమోటోలో ఉన్న సహజ సిధ్ధ ప్రత్యేక లక్షణాలు చక్కటి చర్మాన్ని పొందేలా చేస్తాయి. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఓట్మీల్ ను తీసుకుని తర్వాత ఒక టొమోటో రసాన్ని మాత్రమే వేసి దానిని బాగా కలపాలి. ఓట్మీల్ బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేవరకు పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత దానిని ముఖానికి వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు, నిమ్మ రసం

చర్మం నిగారింపును పెంచటంలో ఈ పధ్ధతి ఎంతో ఉపయోగకరమైనది. ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్స్ పాలు, 2-3 చుక్కలు నిమ్మరసాన్ని వేసుకుని పేస్ట్ గా చేసుకుని తర్వాత దానిని ముఖానికి పట్టించుకోవాలి. 15 నిముషాల తర్వాత ముఖాన్ని చక్కగా శుభ్రం  చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే మీరే ఫలితాల్ని చూడవచ్చు.

బంగాళాదుంప ముక్కలు

బంగాళా దుంప ముక్కలు స్లైసెస్ గా కోసుకుని వాటిని ముఖానికి పెట్టుకుంటే ఎంతో ఫలితముంటుంది. ఎందుకంటే మీ చర్మంపై ఉన్న డార్క్ సర్కిల్స్ ని తీసివేస్తుంది. బంగాళా దుంపను స్లైసెస్ గా కట్ చేసుకుని ముఖానికి రాస్తూ ఉండాలి. అలా రాస్తూ ఉన్నప్పుడు ఆ రసం చక్కగా ముఖానికి పట్టి ఎండిపోతుంది. అలా ఎండినప్పుడు మల్లీ చక్కటి కాన్తివంతమైన చర్మం వస్తుంది. ఎండిపోయిన తర్వాత ముఖాన్ని చక్కగా వేడి నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీరు ఎన్నో ఫలితాలను పొందుతారు.

పెరుగు

ఇది చక్కటి ప్రాడక్టు. పాలతో తయారైన పదార్ధ్ధం కాబట్టి ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్లను చూపించదు. దీనిని ముఖానికి పెట్టుకుని కాస్సేపు అయ్యక వాష్ చేసుకోవాలి. చక్కటి నిగారింపు, మృదుత్వం మీ ముఖం లో మీరే చూడవచ్చు. అంతేకాక రోజుకు రెండు సార్లు వేసుకుంటే ఎంతో మంచిది.

ఆరెంజ్

ఆరెంజ్ మీ చర్మ సౌందర్యాన్ని ఇనుమడించటంలో మంచి పాత్రని పోషించగలదు. దీనిలో విటమిన్ సి ఉండటం వల్ల మీ చర్మాన్ని చక్కగా మృదువుగా నిగారింపుగా చేస్తుంది. ముందుగా ఆరెంజ్ ని తీసుకుని రసాని తీసి తర్వాత కొంచెం పసుపు వేసుకుని కలపాలి. తర్వాత ముఖానికి వేసుకుని రాత్రంతా ఉంచుకుని పొద్దున్నే వాష్ చేసుకోవాలి. అంతేకాక తొక్కల మిశ్రమాన్ని అంటే పవ్డర్ ని తీసుకుని దానికి పెరుగుని కలుపుకుని దానిని శరీరమంతా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మీ చర్మం మంచిగా తయారవుతుంది.

అలోవేరా జెల్

అలోవేరా హైపెర్ పిగ్మెంటేషన్ ను పెరిగేలా చేస్తుంది. ముందుగా అలోవేరా ఆకుని తీసుకుని దానిలోని జెల్ ను తీసి దానిని శరీరానికి రాసుకోవాలి. అలా 30 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మీ చర్మాని ఆరోగ్యవంతంగా చేస్తుంది.

చర్మానికి బ్లీచింగ్ టిప్స్

ఈ బ్లీచింగ్ ఏజెంట్లు మీ చర్మాన్ని చక్కగా తయారు చేయగలవు. కానీ వీటిని కళ్ళకు తగలకుండా రాసుకోవాలి. అంతేకాక వీటిని తగినంతా మోతాదులోనే వాడుకోవాలి. అధిక మోతాదులో వాడటం వల్ల మీ చర్మం బర్న్ అయ్యే ప్రమాదముంది. అంతేకాక వీటిని అప్లై చేసెప్పుడు చక్కటి సన్ స్క్రీన్ లోషన్ ను మాత్రం ఎంచుకోవాలి.

కొన్ని సహజ సిధ్ధ బ్లీచింగ్ ఏజెంట్లు ఏవంటే

దోస మరియు నిమ్మ

దోస మరియు నిమ్మ చర్మ సౌందర్యం ఇనుమడించేందుకు చాలా చక్కగా పనిచేస్తాయి. దోసకాయి గుజ్జుని తీసుకుని 2 టేబుల్ స్పూన్ తీసుకుని దానికి 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసాని వేసి కలుపుకుని దానిని చర్మానికి రాసుకోవాలి. ఇందువల్ల నల్లగా మారిన మీ చర్మం ఎర్ర రంగులోనికి వస్తుంది.

టొమోటో మరియు గంధం పొడి

ముందుగా మీరు 1 టేబుల్ స్పూన్ గంధం పొడి ని తీసుకుని దానికి దోస రసాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ టొమోటో జ్యూస్ ను అలాగే నిమ్మ రసాన్ని వేసుకోవాలి. తర్వాత ముఖానికి వేసుకోవాలి. మీ చర్మం ఎక్కడైతే నల్లగా అవుతోందో అక్కడ చక్కగా వేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు వేసుకుంటే చాలా ఉపయోగం.

పాలు మరియు ఆరెంజ్ తొక్కలు

ముందుగా ఆరెంజ్ తొక్కల్ని తీసుకుని తర్వాత వాటిని ఎండలో 3-4 రోజుల పాటు ఎండబెట్టాలి. తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పవ్డర్ ను తీసుకుని ఒక బౌల్ లోనికి వేసుకోవాలి. దానికి కొంచెం పాలు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. ఇలా 15 నిముషాల పాటు ఉంచుకుని తర్వాతా వాష్ చేసుకోవాలి. ఇది చక్కగా పని చేస్తుంది, మీ చర్మం చక్కగా మారుతుంది.

పైనాపిల్ మరియు పాలు

పైనాపిల్ ముక్కలుగా కోసుకుని తర్వాత దానిని గుజ్జుగా చేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకుని జ్యూస్ గా చేసుకోవాలి. దీనికి కొంచేం పాలని వేసుకుని తర్వాత బాగుగా కలుపుకుని తర్వాత ముఖానికి వేసుకోవాలి. తర్వత 10 నిముషాలకు వాష్ చేసుకోవాలి.

ఆల్మండ్ మరియు తేనె

ఆల్మండ్ గింజల్ని రాత్రంతా నానపెట్టుకోవాలి. తర్వాత వాటిని తేనె తో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి వేసుకోవాలి. తర్వాత కాసేపటికి వాష్ చేసుకోవాలి.

సహజసిధ్ధమైన బ్లీచ్ వల్ల ఉపయోగాలు

మీ చర్మం చక్కగా మారాలంటే సహజసిధ్ధమైన బ్లీచ్ లను వాడటం ఎంతో మంచిది. వీటి వల్ల ఏ రకమైన సైడ్ ఎఫ్ఫెక్ట్లు ఉండవు. అంతేకాక మార్కెట్లో దొరికే ప్రాడక్ట్ల వల్ల మీ చర్మమే కాక మీ జేబుకూ భారమే . కాబట్టి చాలా వరకూ సహజసిధ్ధమైన వాటిల్ని వాడటం వల్ల ఏ ఇబ్బందులూ రావు. దీనికి తోడు సూర్యుని వేడిమిని నుంచీ జాగ్రత్తలు వహించాలి. ఎక్కువగా మంచి నీటిని తీసుకోవాలి. ఆహార నియమాలలో భాగంగా ఎక్కువగా ఫ్రూట్స్ తినటం వల్ల మీ చర్మం మంచి నిగారింపుగా తయారవుతుంది.

దీర్ఘకాలిక చర్మ సౌందర్యానికి కొన్ని గృహ చిట్కాలు

పాలు మరియు తేనె ఫేస్ప్యాక్

మీ చర్మం నల్లగా మరి ఉంటే దానిని తొలగించటంలోనూ, అలాగే చర్మం చక్కటి నిగారింపుకూ ఈ ప్యాక్ చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమం చక్కగా పని చేసి చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. దీనికి గానూ 1 టేబుల్ స్పూన్ పాలు అలాగే దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఒక మిశ్రమంగా చేసి ఫేస్ కి వేసుకోవాలి. తర్వాత 2 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

అరటి మరియు ఆల్మండ్ ఆయిల్ ప్యాక్

అరటిపండులో విటమిన్ బి-6, విటమిన్-సి ఉండటం వల్ల ఇది చాలా చక్కగా పని చేస్తుంది. అంతెకాక దీనిలో ఉన్న సహజ సిధ్ధమైన లక్షణాలు చర్మ సౌందర్యాన్ని పెంచేలా చేస్తాయి. అంతేకాక ఆల్మండ్ ఆయిల్ చక్కగా ముఖాన్ని ఆరోగ్యవంతంగా పనిచేసేలా చేస్తుంది. దీనిలో యాంటీ ఇంఫ్లామాటరి ప్రాపెర్టీస్ ఉండటం వల్ల చర్మాన్ని పరిరక్షిస్తుంది. ఒక అరటిపండును తీసుకుని గుజ్జుగా చేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది చక్కగా పని చేస్తుంది.

శనగపిండి మరియు పసుపు

శనగపిండి చర్మంపై ఉన్న నల్ల మచ్చల్ని తొలగించటంలో ప్రధాన పాత్రని పోషిస్తుంది. అలాగే పసుపు కూడా చాలా రకాల గుణాల్ని కలిగి ఉండటమే కాక ఇది మంచి యాంటీ సెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. పసుపు మన కిచెన్ లో అదీ ప్రతీ రెసిపీలో వాడేదే. హిందూ వివాహాలలో, వేడుకల్లో దీనిని బాగా వాడతారు. పెళ్ళిళ్ళలో దీనిని శరీరానికి రాస్తారు. ఎందుకంటే చర్మం పై ఉన్న చెడు ప్రభావాన్ని ఇది ఇట్టే పోగొడుతుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. ఇది చక్కటి చర్మం పొందేలా చేస్తుంది.

క్రీం మరియు వాల్నట్ ఫేస్ప్యాక్

వాల్నట్లో విటమిన్ బి,విటమిని సి అలాగే యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. ఇది చర్మంపై చక్కగా పనిచేస్తుంది. వాల్నట్ మరియు క్రీం తీసుకుని ఫేస్ప్యాక్ గా చేసుకుని ముఖానికి వేసుకుంటే మంచిది. 4-5 వాల్నుట్స్ తీసుకుని వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ క్రీం ను కలిపి ఫేస్ప్యాక్ గా వేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి.

బొప్పాయి

బొప్పాయి ఫేస్ప్యాక్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే బొప్పాయిలో ఉన్న సహజసిధ్ధ గుణాలు ఎన్నో..బొప్పాయి చర్మం లోని మృత కణాల్ని తీసివేస్తుంది. చర్మం మరింత జీవం గా కనిపించేలా చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్-సి, విటమిన్-ఇ ఉండటం వల్ల చక్కగా పనిచేస్తుంది. ఒక బొప్పాయిని తీసుకుని గుజ్జుగా చేసి దానికి తేనె కలుపుకుని దానిని ఫేస్ప్యాక్ గా పెట్టుకుంటే ఎంతో మంచిది. దీనిని మీ ముఖం నుంచీ మెడ వరకూ పెట్టుకోవాలి. దీనిని 20 నిముషాల పాటూ ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

చమోమిలే టీ ఫేస్ప్యాక్

చమోమిలే చాలా చక్కటి రెమెడీ. దీనిని 1 టేబుల్ స్పూన్ తీసుకుని, ఒక 2 చుక్కలు ఆల్మండ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఓట్మీల్, 2 టేబుల్ స్పూన్స్ తేనె వెసుకుని ఒక కంటేనర్ లో కలిపి ముఖానికి పెట్టుకోవాలి. ఇలా చేస్తే మంచి నిగారింపు,జీవం ఉట్టిపడుతుంది.

పుచ్చకాయి మరియు దోస

పుచ్చకాయ జ్యూస్ 2 టేబుల్ స్పూన్స్, దోస,పెరుగు-1 టేబుల్ స్పూన్, మిల్క్ పవ్డర్- 1 టేబుల్ స్పూన్ వేసి చక్కగా పేస్ట్ చేసుకుని ముఖానికి వేసుకోవాలి. పుచ, దోస రెండిటిలో చాలా రకాలైన మంచి గుణాలున్నాయి. ఇవి చక్కటి చర్మాని పొందేలా చేస్తాయి.

సంఫ్లవర్ ప్యాక్

సంఫ్లవర్ లేదా చిరొంగి. దీనిని ఫేస్ప్యాక్ గా చేసుకోవాలంటే రెండు కావాలి. అవేంటంటే ఒకటి సగం కప్పు పాలు, రెండవది సంఫ్లవర్ గింజలు, వీటిని రాత్రి అంతా నానపెట్టి ప్రొద్దున్నే పేస్ట్ గా చేసుకుని ముఖానికి వేసుకోవాలి. 5 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

బియ్యం తో ప్యాక్

ఏంటీ రైస్ తో ఫేస్ ప్యాకా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..దీనికి ముందుగా 2 స్పూన్స్ రైస్ ను పాలల్లో నానపెట్టాలి. దీనికి మాత్రం తాజా పాలు మాత్రమే అదీ 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో మరలా 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకుని పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత దానికి కాస్త నిమ్మరసాన్ని వేసుకోవాలి. ముఖానికి వేసుకోవాలి.

జాస్మిన్ ఫ్లవర్ ఫేస్ ప్యాక్

మీరు ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవాలంటే ముందు ఒక జాస్మిన్ ఫ్లవర్ ను తీసుకుని దానిని గుజ్జుగా చేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కలిపి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిని ముఖానికి వేసుకోవాలి. 15 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

No comments:

Post a Comment