Saturday 28 January 2017

బికినీ ధరించే ప్రాంతంలో నల్లని వలయాలను తొలగించుటకు సహజమైన టిప్స్


బికినీ ధరించే ప్రాంతంలో నల్లని వలయాలను తొలగించుటకు సహజమైన టిప్స్



బికినీ ధరించడం వలన సూపర్ హాట్ మరియు సెక్సీగా కన్పిస్తారు. బికినీ ధరించే ప్రాంతంలో నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇవి చెమట, దద్దుర్లు మొదలగు వాటి వలన వస్తాయి. వాటిని తొలగించడానికి అనేక చిట్కాలు ఉన్నవి. కావున దుస్తులను ధరించే విషయంలో మీరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. కొన్ని సహజ నివారణల ద్వారా మీరు బికినీ నల్లని వలయాల నుంచి విముఖ్తి పొందవచ్చు.
బికినీ నల్లని వలయాలు ఏర్పడటం చాలా మంది మహిళలకు ఒక సమస్య. కొన్ని గృహ చిట్కాల వలన వీటిని తొలగించవచ్చు.

పాలియెస్టర్ దుస్తులు

పాలియెస్టర్ దుస్తులు ధరించడం వలన చమట ఎక్కువగా వస్తుంది. దీని వలన బికినీ ప్రదేశంలో ఎపిడేర్మిస్ (చర్మ పొర) దెబ్బతింటుంది. మీరు భారీ శరీరాన్ని కలిగి ఉంటే పాలియెస్టర్ దుస్తులు ధరించడం మంచిది కాదు. అంతే కాకుండా ఈ దుస్తులు ధరించడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

జుట్టు తొలగింపు

బికినీ ప్రదేశంలో జుట్టును తొలగించే క్రీములు వాడటం వలన మీకు శాశ్వత నల్లని వలయాలు వస్తాయి. రసాయనాలు లేని ప్రొడక్ట్స్ వాడటం వలన బికినీ నల్లని వలయాలు రాకుండా చేయవచ్చు. మీరు సహజ గృహ చిట్కాలను వాడి ఫలితాన్ని చూడండి.

బికినీ నల్లని వలయాలను తొలగించుటకు ఇంటి చిట్కాలు

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్తో బికినీ ప్రదేశంలో మసాజ్ చేసి, రాత్రి అంతా అలానే ఉంచాలి. ఈ చిట్కా నల్లని వలయాలను తగ్గించుటకే  కాకుండా చర్మాన్ని మృధువుగా చేసి ఎపిడేర్మిస్ మీద దద్దుర్లని తొలగిస్తుంది.

పసుపు

ఇది సహజంగా చర్మాన్ని రక్షిస్తుంది. నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఒక  టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ పెరుగును కలిపి పేస్టు చేసి, బికినీ నల్లని వలయాల వద్ద అప్లై చేయాలి. 10–15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఈ చిట్కాని వారానికి 3 సార్లు స్నానానికి ముందు చేయడం మంచిది.

నిమ్మకాయ

చర్మానికి చెమట రావడం వలన వాసన వస్తుంది. నిమ్మకాయ రసాన్ని బికినీ నల్లని వలయాల వద్ద రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వలన నల్లని వలయాలను పోగొట్టి మృత కణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా భవిష్యత్తులో ఇలా రాకుండా చేస్తుంది.

టమాటో

దీనిని బికినీ ప్రదేశంలోనే కాకుండా ఇతర శరీర భాగాలలో ఎక్కడ నల్లటి వలయాలు ఉంటే అక్కడ వాడవచ్చు. టమాటో గుజ్జుతో నల్లని వలయాలు ఉన్న దగ్గర రుద్దుతూ అప్లై చేసి, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వలన నల్లని వలయాలు తొలగుతాయి.

బొప్పాయి

బొప్పాయిని ఉపయోగించడం వలన నల్లని వలయాలను తొలగించవచ్చు. బికినీ నల్లని వలయాల వద్ద బొప్పాయి గుజ్జును అప్లై చేసి బాగా రుద్దాలి, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉండటం వలన చర్మం మీద నల్లని వలయాలను పోగొడుతుంది.

పుదీనా ఆకులు

దీనిని ఎక్కువగా చర్మానికి ఉపయోగించే క్రీములలో వాడతారు. ఈ చిట్కా చాల మంచి ఫలితాన్ని ఇస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను తీసుకొని మిక్సర్ సహాయంతో నీటిని కలుపుతూ పేస్టు చేసి, ఒక స్పూన్ పేస్టులో తేనెను కలిపి బికినీ నల్లని వలయాల వద్ద రాయాలి. కొన్ని రోజులలో మీరు తేడాని గమనించగలరు.

బాదం

బాదంను తీసుకొని ఒక రాత్రి అంత నానాపెట్టాలి. బాదంలో పాలు కలిపి పేస్టు తయారు చేసి, మిశ్రమాన్ని బికినీ ప్రాంతంలో రాసి రాత్రి అంతా అలానే ఉంచి, ఉదయాన్నే శుభ్రం పరచాలి. దీనిని 2 వారలు చేయడం వలన మీరు మార్పును గమనించగలరు.

పంచదార, తేనే మరియు నిమ్మరసం

ఒక టేబుల్ స్పూన్ తేనే, సగం నిమ్మరసం, పంచదారను కలిపి అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. 10 నిమిషముల తరువాత నీటితో కడగాలి. తేనే మరియు పంచదార శరీరాన్ని మృదువుగా తయారు చేస్తాయి. నిమ్మరసం నల్లని వలయాలను పోగొట్టుటకు సహాయపడుతుంది.

బాదం నూనె, పాలు, నిమ్మరసం మరియు తేనే

3 స్పూనుల పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు నిమ్మ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెలో కలిపి పేస్టు చేసి, నల్లని వలయాల వద్ద అప్లై చేయాలి. ఇది నల్లని వలయాలను తొలగించుటకు ఉపయోగపడుతుంది.

పచ్చి పాలు

బికినీ నల్లని వలయాలను తొలగించుటకు పచ్చి పాలు ఒక అద్భుతమైన చిట్కాగా పని చేస్తాయి. పచ్చి పాలను దూది సహాయంతో బికినీ నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేయాలి. ఇది సహజంగా చర్మాన్ని తెల్లగా చేస్తుంది.

గంధం

గంధం యొక్క ఉపయోగాల గురించి మీరు వినే ఉంటారు. చర్మ సమస్యలకు గంధం ఒక అద్భుతమైన చిట్కా. మీకు బికినీ నల్లని వలయాలు ఉంటే గంధం పొడి పేస్టుని రాసి అద్భుతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

నారింజ తొక్క మరియు పెరుగు

తాజా నారింజ పండు యొక్క తొక్కను తీసుకొని ఎండలో ఎండపెట్టాలి. బాగా ఎండిన తరువాత గ్రైండర్ సహాయంతో పొడి చేయాలి. దీనిలోకి 2 స్పూనుల పెరుగు మరియు ఒక స్పూన్ తేనే కలిపి పేస్టు తయారు చేసి బికినీ నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేసి, నీటితో కడగాలి.

దోస మరియు తేనే

దోస ముక్కను నల్లని వలయాలు ఉన్న దగ్గర రుద్దాలి. రుద్దిన తరువాత 1 టేబుల్ స్పూన్ తేనే అప్లై చేయాలి. తరువాత తేడాను మీరు గమనించగలరు. అలానే దోసకాయ గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనే కలిపి పేస్టు తయారు చేసి బికినీ నల్లని వలయాల వద్ద అప్లై చేసి, నీటితో కడగాలి.

బికినీ నల్లని వలయాలను దూరం చేయడం ఎలా?

సహజమైన కాటన్ అండర్ వేర్ వాడటం

మీరు కాటన్ అండర్ వేర్ వాడటం వలన చర్మం మీద ఎటువంటి నల్లని వలయాలు మరియు దద్దుర్లు రాకుండా చేస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం

తాజా కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం వలన మీ చర్మానికి ఉపయోగకరం. అన్ని రకముల ధాన్యపు గింజలు కూడా చర్మానికి మంచిదే. నూనెను తక్కువగా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవడం మీ చర్మానికి ఆరోగ్యకరం.

నీరు

ఎక్కువగా నీటిని తీసుకోవడం వలన మీ శరీరం లోపలి భాగాలలో ఉండే విష కణాలు బయటకు వస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రోజుకి 8 గ్లాసుల నీటిని త్రాగటం చాల మంచిది.

అలోవేర

అలోవేర గుజ్జు తీసుకొని బికినీ నల్లని వలయాల వద్ద అప్లై చేసి, నీటితో కడగాలి.

బంగాళదుంప

బంగాళదుంప చర్మం మీద నల్లని వలయాలను తొలగించుటకు ఒక అద్భుతమైన చిట్కాగా పనిచేస్తుంది. బంగాళదుంప ముక్కతో రుద్దుతూ నల్లని వలయాలను దూరం చేయవచ్చు. అంతే కాకుండా బంగాళదుంప గుజ్జును కూడా వాడవచ్చు.

బేకింగ్ సోడా

బికినీ ప్రదేశంలో మరియు మీ శరీరం మీద ఎక్కడైనా నల్లని వలయాలు ఉంటే అక్కడ మీరు బేకింగ్ సోడా వాడటం వలన ఒకటి రెండు వారాలలో ఫలితాన్ని పొందగలరు. బేకింగ్ సోడాని నీటిలో కలిపి పేస్టు తయారు చేసి నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేయాలి. 5 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇది ఒక అద్భుతమైన చిట్కా. దీనిని వారానికి 2 సార్లు చేయాలి.

No comments:

Post a Comment