Friday 27 January 2017

చీరకట్టులోనూ చిట్కాలున్నాయ్‌!

చీరకట్టులోనూ చిట్కాలున్నాయ్‌!
చీర కట్టుకుంటే వయసు ఎక్కువగా కనపడుతుందనుకుంటారు కొందరు. కాదు, చీరలోనే అసలైన అందం దాగుందంటారు మరికొందరు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. మన శరీరాకృతిని బట్టి చీరకట్టడంలో కొన్ని కిటుకులు తెలిసుండాలి.
* అందంగా కనిపించాలంటే ముందు శరీర ఆకృతికి సరిపోయే చీరను ఎంచుకోవడం తెలుసుండాలి. ప్రింట్లూ, కొన్ని రకాల డిజైన్లూ శరీరాకృతిని ఒక్కో తీరుగా కనిపించేలా చేస్తాయి. అందుకే మీ ప్రాధాన్యానికి అనుగుణంగా చీరల్ని ఎంచుకోండి.
* షిఫాన్‌, జార్జెట్‌, క్రేప్‌ రకాల చీరలైతే తక్కువ బరువుండి.. ఒంటికి అతుక్కుపోయి మిమ్మల్ని సన్నగా, నాజూగ్గా కనిపించేలా చేస్తాయి.
* చాలా పెద్దగా, ఎక్కువ వెడల్పు అంచులున్న చీరల వల్ల ఎత్తు తక్కువగా కనిపిస్తారు. అందుకే చిన్న అంచులున్న, లేదంటే అసలు అంచుల్లేని వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి.
* కేవలం చీరలే కాదు.. మనం ఎలా కనిపించాలన్నది చీర కట్టుకునే విధానంపైనా ఆధారపడి ఉంది. కొంగును వీలైనంత సన్నగా వేసుకోవాలి. లేదంటే నడుము భాగం ఉబ్బెత్తుగా ఉండి మీరూ లావుగా కనిపించే అవకాశం ఉంది.

* ‘నేను బాగా లావుగా ఉన్నా’ అని పదే పదే గుర్తు చేసుకోకండి. దీనికి బదులు బరువు తక్కువగా ఉండే చీరల్ని ఎంచుకోండి. అలాగే చిన్న చిన్న ప్రింట్లు ఉన్న చీరల్ని కట్టుకుంటే సన్నగా కనిపించొచ్చు.

No comments:

Post a Comment