Thursday 26 January 2017

మాయిశ్చరైజర్‌ తయారుచేద్దామా..

మాయిశ్చరైజర్‌ తయారుచేద్దామా..
చలికాలంలో పొడిబారిన చర్మానికి మాయిశ్చరైజర్‌ తప్పనిసరి. అలాగని దాన్ని ఎప్పుడూ కొనుక్కోవాలని లేదుగా. ఇంట్లో దొరికే పదార్థాలతోనూ మాయిశ్చరైజర్‌ని తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే..
చెంచా తేనె, చెంచా చొప్పున కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల పాటు మృదువుగా రద్దుతూ ఉండాలి. కాసేపయ్యాక కడిగేయాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు దీన్ని ముఖానికి రాసుకుని మర్నాడు కడిగేసుకోవాలి.
నాలుగు చెంచాల పాలూ, రెండు చెంచాల నిమ్మరసం, రెండు మూడు చెంచాల ఆలివ్‌ నూనె కలిపి ముఖం, మెడా, చేతులకు రాసుకోవాలి. పాలలో ఉండే లాక్టిక్‌ ఆమ్లం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆలివ్‌ నూనె చర్మాన్ని మెరిపిస్తుంది. నిమ్మరసం మృతకణాలను తొలగించడంతో పాటు మొటిమలు రాకుండా కాపాడుతుంది. మొత్తంగా చర్మం తాజాగా కనిపిస్తుంది.
గులాబీ నీళ్లు మురికిని తొలగించి చర్మాన్ని తాజాగా మారుస్తాయి. గుప్పెడు గులాబీ రేకల్ని కప్పు వేడి నీళ్లలో మరిగించాలి. అందులోనే కొన్ని చుక్కల గులాబీ నీళ్లు చేర్చాలి. ఈ నీళ్లు చల్లారాక అందులో చెంచా ఆలివ్‌నూనె కలిపి అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ నీటిని ముఖానికి రాస్తూ ఉంటే ముఖం తేమగా మారుతుంది.

No comments:

Post a Comment