Saturday 28 January 2017

గులాబీ రంగు పెదవుల్ని పొందాలంటే? – Telugu tips for beautiful lips

గులాబీ రంగు పెదవుల్ని పొందాలంటే? – Telugu tips for beautiful lips

Mar 26, 2016
గులాబీ పెదవులుంటే ఆ అందమే వేరు. పెదవులు ఎంత అందంగా ఉంటే అతివలకు అంత అందం. గులాబీ రంగు పెదాలు..కావాలని ప్రతీ మగువ కోరుకుంటుంది. ఇది ఓ రకంగా అందాన్నే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది. లేలేత పెదవులు ముఖంలో ఓ సున్నితమైన అంగమే. పెదవులు నూనె గ్రంధులు లేని ప్రదేశం. కాబట్టి వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా పెదవులు డార్క్ గా ఉండటానికి కారణం సూర్యుని యూవి కిరణాలు, ధూమపానం, అలెర్జీలు, హార్మోన్ల అసమానతలు కారణాలు గా చెప్పవచ్చు.
పెదవులు గులాబీ రంగులో ఉండేందుకు కొన్ని లిప్ బాల్మ్ లు, లిప్ స్టిక్స్ ఉన్నాయి కానీ అవి మీ పెదవులకు హాని కలిగిచవచ్చు. కానీ కొన్ని గృహ సంబంధమైన స్క్రబ్స్ వలన మీ పెదవులు చక్కగా గులాబీ రంగులో ఆరోగ్యంగా ఉంటాయి.
చక్కని గులాబీ రంగుతో కూడిన మృదువైన పెదవులు ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం, మన దైనందన దినచర్య, కఠినమైన పరిస్థితులు సరియైన జాగ్రత్తలు తీసుకోలేనంతగా మనల్ని ప్రభావితం చేస్తాయి.
అస్సలు పెదవులు నిస్సారంగా ఎలా తయారవుతాయి? కానీ కొన్ని కారణాల వల్ల పెదవులు పొడిగా, మృదుత్వం లేకుండా, నిస్సారంగా తయారవుతాయి. వాటిలో కొన్ని ఏమిటంటే సూర్యకిరణాలవల్ల, ధూమపానం, మధ్యపానం, ఎక్కువగా పెదవుల్ని చప్పరించటం, శరీరం లో వేడిమి, విటమిన్ల లోపం, కొవ్వు ఆంల విడుదల ఇవేకాక మందుల వాడకం వల్ల కూడా పెదవులు డార్క్ గా తయారవుతాయి.
ఇక సందేహం ఎందుకు రండి చక్కని గులాబీ రంగులను పొందేందుకు తెలుగు టిప్స్ మీకు అందిస్తొంది..ఈ ఆర్టికల్ లో..ఇక ఏ రకమైన ఇబ్బందులూ రాకుండా కొన్ని రకాల గృహ చిట్కాలను తెలుసుకుందాం.. అవేంటో చూద్దామా..!
గులాబీ రంగు పెదవుల కోసం కొన్ని రకాల సహజసిధ్ధ గృహ చిట్కాలు (Telugu beauty tips to get pink rose lips)
క్రీం మరియు కుంకుమ
1 టేబుల్ స్పూన్ పాలు, 1 టేబుల్ స్పూన్ పాల క్రీం, కొంచెం కుంకుమను కలిపి ఫ్రిజ్ లో పెట్టుకుని మీ పెదవులకు రాసుకోంది. తర్వాత ఒక కాటన్ బాల్ తో తుడుచుకోవాలి.
పాలు మరియు గులాబీ రేకులు
1 టేబుల్ స్పూన్ పాలు అలాగే కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని పాలల్లో బాగా గులాబీ రేకుల్ని పాలల్లో గులాబీ రంగు క్రష్ చేయాలి. తర్వాత దీనిని ఫ్రిజ్ లో చల్లగా అయ్యేంత వరుకూ ఉంచాలి. తర్వాత దానిని తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ పవ్డర్ వేసి పేస్ట్ గా చేసుకుని ఆ పేస్ట్ ని పెదవులకు వేసుకోవాలి. 10- 15 నిముషాలు అలాగే ఉంచుకుని పొడి దూదితో తుడుచుకోవాలి. దీనివల్ల మీ పెదవులు గులాబీ రంగుతో, మృదువుగా, ప్రకాశవంతంగా మారతాయి.
అలాగే పాలల్లో గులాబీ రేకుల్ని బాగా మిక్స్ చేసి తర్వాత కొంతసేపు ఉంచి తర్వాత ఆ పేస్ట్ ని పెదవులకు వేసుకోవచ్చు. అలాగే పాలకు బదులు మీరు గ్లిసరిన్ కూడా వాడవచ్చు.
బీట్రూట్ తో పాల క్రీం
బీట్రూట్ తో పాల క్రీం ను కలిపి మిశ్రమం గా చేసుకోవాలి. లేద దానిమ్మను కూడా క్రీం తో కలిపి మిశ్రమం గా చేసి పెదవులకు వేసుకుంటే అది చక్కటి మృదువైన పెదవుల్ని ఇస్తుంది. పగిలిన పెదవులు సైతం మారి చక్కటి గులాబీ రంగు పెదవులుగా మారతాయి.
తేనె మరియు నిమ్మ
తేనె చక్కటి అన్ని రకాల చర్మాలకూ పడే పదార్ధం. దీనిని మీ పెదవుల సమ్రక్షణకు కూడా వాడవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ తేనె అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కలుపుకోవాలి. తర్వాత మీ పెదవులకు వేసుకోవాలి. కొంత సమయం అయ్యక చల్లటి నీటితో కడుగుకోవాలి. తర్వాత మీ జీవం లేని పాలిన పెదాలు గులాబీ రంగులోనికి మారటం గుర్తించవచ్చు.
టొమాటో మరియు పాల క్రీం
మిల్క్ క్రీం లో టొమాటో పేస్ట్ ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకోవాలి.
చక్కని గులాబీ రంగు పెదవుల పొందాలంటే నెయ్యి లేదా వెన్న లేదా కుంకుమలు సహజ సిధ్ధమైన చికిత్సా మార్గాలు.
చక్కని పెదవులకోసం ఆయుర్వేదంలో టిప్స్ ఉన్నాయి. దానిలో ప్రధానమైనది ఎండు ద్రాక్షాలని రాత్రి అంతా నాన పెట్టి ఉదయాన్నే పరగడుపుతో తింటే పెదవులు ఎంతో చక్కగా మారతాయి.
క్యారెట్ జ్యూస్
బీట్రూట్ జ్యూస్ లాగే క్యారెట్ జ్యూస్ కూడా మీ పెదవులను చక్కగా మారుస్తుంది. ఒక క్యారెట్ ను తీసుకుని దానిని గుజ్జుగా చేసి ఆ రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచిది. మీ పెదవులు పొడిబారినప్పుడల్లా ఈ జ్యూస్ ను రాసుకుంటే చక్కటి మృదువైన, గులాబీ పెదవులు మీ సొంతం అవుతాయి.
దోస ముక్కలు
దోస ముక్కల్ని మీ పెదవులకు రాసుకుంటే ఎంతో బాగా పని చేస్తాయి. ఇవి చర్మం పైనే కాదు చక్కటి పింక్ పెదవుల్ని మీ సొంతం చేస్తాయి. కొన్ని నిముషాలపాటు పెదవులపై రాస్తే ఎంతో మంచిది. దోస ముక్కల్ని ఇలా ఎక్కువ సార్లు రాస్తూ ఉంటే త్వరగా మీకు ఫలితం కనిపిస్తుంది.
ఆరెంజ్ తొక్కలు
ఆరెంజ్ తొక్కలు తీసి పారేస్తున్నారా? అయితే ఆగండి ఇకపై అలా చేయకండి ఎందుకంటే ఇవి మీ పెదవుల మృదుత్వాన్ని పెంచుతాయి. అంతేకాక మీ డార్క్ పెదవుల్ని మార్చి ప్రకాశవంతంగా చేస్తాయి. మీ పెదవులపై వాటిని రెండు నిముషాల పాటు మస్సాజ్ చేసుకోండి..తర్వాత ఫలితాల్ని మీరే చూడండి.
ఆలివ్ ఆయిల్
ఆయిల్స్ మంచి గులాబీ రంగు పెదవుల్ని పొందేలా చేస్తాయి. మంచి గులాబీ రంగు పెదవుల కోసం ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మ ను కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక ఇది ఒక బాల్మ్ లా రోజూ మీరు రాసుకోవచ్చు.
మింట్ జ్యూస్
మింట్ జ్యూస్ తో పాటు రోస్ వాటర్ ను కలిపి రాసుకుంటే మీ పెదవులు కొత్త రూపు పొందుతాయి. మింట్ జ్యూస్ ఎక్కువ మోతాదు కాకుండా చూసుకోవాలి..ఎందుకంటే అది వేడి చేసే ప్రమాదముంది.
సుగర్ స్క్రబ్
మీ పెదవులకు సుగర్ మరియు వెన్న కలిపి రాసుకుంటే ఎంతో మంచి ఫలితాలొస్తాయి. సుగర్ మీ చర్మం పై ఉన్న మృత కణాల్ని తీసి వేయగా.. వెన్న మీ పెదవులకు కొత్త జీవాన్ని ఇచ్చి మృదువుగా చేస్తుంది.
పసుపు స్క్రబ్
ముందుగా పసుపు తీసుకుని దానితో పాటు పాలు కలిపి మిశ్రమం గా చేసుకుని తర్వాత దానిని ఒక మెత్తటి బ్రష్ తో మస్సాజ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకుని పొడి టవల్ తో తుడుచుకోవాలి. తర్వాత సహజసిధమైన లిప్ బాల్మ్ రాయాలి.
నిమ్మ
నిమ్మలో చాలా రకాలైన సహజసిధ్ధ రసాయనాలు ఉన్నాయి. ఇది సహజ సిధ్ధమైన బ్లీచ్. ఇది పెదవులపై ఎంతో చక్కగా పనిచేస్తుంది. రోజూ తాజా నిమ్మకాయను తీసుకుని రాత్రి నిద్రపోయే ముందు మస్సాజ్ చేసుకోవాలి.
రస్ప్బెర్రీ
వీటిలో చాలా ఎక్కువ మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. కాబట్టి మీ పెదవుల ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయి. వీటి వల్ల మీ పెదవులు చాలా ఆకర్షణీయంగా కనపడతాయి. కొన్ని రస్ప్బెర్రిలను తీసుకుని వీటితో పాటు అలోవేరా, తేనె కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత మస్సాజ్ చేసుకుని ఆ తర్వాత 10 నిముషాలకు శుభ్రం చేసుకోవాలి.
సహజసిధ్ధ గృహ తరహా లిప్ బాల్మ్
ఒక స్ట్రాబెర్రి పబ్ ని తయారు చేసుకుని దానిలో పెట్రోలియం జెల్లీ వేసుకోవాలి. ఇది చక్కటి గులాబీ పెదవులుగా మారుస్తుంది.
1. తేనె, ఆల్మండ్, సుగర్ ను మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని 10 నిముషాల పాటు మస్సాజ్ చేసుకోవాలి.
2. కొత్తిమీర, క్యారెట్ జ్యూస్, మింట్ జ్యూస్ కలిపి రాసుకుంటే ఎంతో మంచిది.
3. రోజూ మీగడ ను రాసుకోండి. పాలు కాచిన తర్వాత దానిపై వచ్చే మీగడ మీ పెదవులకు రాసుకుంటే ఎంతో సున్నితంగా,మృదువుగా మారతాయి.
4. పచ్చి బంగాళ దుంప ముక్కల్ని పెదవులకు రాసుకుంటే డార్క్ గా ఉన్న పెదవులు రంగు మారి ప్రకాశవంతంగా తయారవుతాయి.
గులాబీ పెదవుల కోసం పెదవుల వ్యాయామాలు:
1. రోజూ మీరు నిద్రకు ఉపక్రమించే ముందు చక్కగా మస్సాజ్ చేసుకోండి. దీనివల్ల మీకు విటమిన్-ఇ దొరుకుతుంది.
2. సున్నితంగా మీ పెదవుల్ని పై దిశగా మస్సాజ్ చేసుకోండి.
3. చూపుడు వేలితో పెదవులపై క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ లఒ మస్సాజ్ చేసుకోవాలి.
4. మీ చూపుడు వేలితో పై దిశగా అలాగే కింది దిశగా కదుపుతూ మస్సాజ్ చేసుకోండి.
5. మీ పెదవుల్ని పొడి దూదితో తుడుచుకుని లిప్ బాల్మ్ ని వేసుకోండి. అది సూర్యుని వేడిమి నుంచీ కాపాడుతుంది.
ఇంకో చివరి అలాగే ముఖ్యమైన విషయమేమంటే ఎక్కువగా మంచి నీరు ఎంత తీసుకుంటే మీ పెదవులు అంతగా బాగుంటాయి.
మరిన్ని టిప్స్
పొడిబారటం మొదలైతే మీ పెదవులు పాడైపోతాయి. అలా జరుగకుండా ఉండాలంటే మీరు ఆల్మండ్ ఆయిల్, సహజసిధ్ధ మైనంతో రుద్దుట, క్యాడిల్లాక్ మైనపు వ్యాక్స్, గ్లిసరిన్, విటమిన్-ఇ ను వాడాలి.
పొడిబారిన పెదవులు చాలా నిస్సారంగానూ, పాలిపోయీ కనపడతాయి. శరీరం లోనీ వేడిమి వల్ల కూడా పెదవులు పొడిబారిపోతాయి. కాబట్టి శరీర వేడిమిని అదుపులో ఉంచుకోవాలి.
రోజూ పెదవులకు సహజసిధమైన బ్లీచ్ ఎంతో అవసరం. సుగర్, వెన్న లతో కూడిన బ్లీచ్ ఎంతో చక్కగా పనిచేస్తుంది.
కొన్ని రకాలైన డార్క్ కలర్ లిప్స్టిక్స్ ని వాడకండి. అంతేకాక కొన్ని లిప్స్టిక్స్ లో టాక్సిన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ రసాయనాల వేడి మీ పెదవులపై పడే అవకాశముంది. కాబట్టి అటువంటి వాటిని వాడకపోవటం మంచిది.
ధూమపానం వల్ల పెదవులు నల్లగా మారతాయి. సహజమైన రంగుని కోల్పోతాయి. కాబట్టి పొగ త్రాగటం మానేయ్యాలి.
సూర్య కిరణాల వల్ల కూడా పెదవులు పొడిబారి డార్క్ గా తయారవుతాయి. దీనికి కారణం అధికంగా మెలామైన్ ఉండటమే. ఇందుకోసం జాగ్రత్తపడేందుకు బాల్మ్ వాడటమే.
కృత్రిమమైన కాస్మెటిక్స్ రసాయన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి దానిమ్మ, బీట్రూట్ కలిసిన ప్రోడక్ట్లు లాంటివి వాడటం మంచిది.
మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు తినాలి.విటమిన్ సి ఉండటం వల్ల మీ పెదవులు పిగ్మెంటేషన్ కు గురికావు.
క్లోరినేటెడ్ వాటర్ కూడా పెదవుల పిగ్మెంటేషన్ కు కారణం. కాబట్టి ఈ నీటిని వాడరాదు.
ఆయిల్ ను రాసుకుని రాత్రి అంతా ఉంచుకుంటే ఎంతో మంచిది.
ఆల్మండ్ ఆయిల్ ను అలాగే కొబ్బరి నూనె ను సమపాళ్ళల్లో కలిపి రోజూ 2 వారాల పాటూ రాసుకుంటే మంచి ఫలితముంటుంది.
రోజూ పెదవులకు మీగడని అలాగే కుంకుమని రాసుకోండి.
ఒక మెత్తని బ్రెస్సిల్స్ ఉన్న బ్రష్ తీసుకుని చక్కగా పెదవులపై మస్సాజ్ చేసుకోండి. దీనివల్ల మృత చర్మం పోతుంది.
ఇక ఐస్ క్యూబ్స్ ని తీసుకుని వాటితో పెదవులపై మస్సాజ్ చేసుకుంటే ఎంతో మంచిది.
లవ్వంగ నూనె తో మస్సాజ్ చేసుకుంటే మంచి పెదవులుగా పింక్ పెదవులుగా మారేలా చేస్తుంది.
ఆహారం
మీరు తీసుకునే ఆహారం చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో పొందే విటమిన్లే చాలావరకూ మీ శరీరాన్ని, అలాగే మీ పెదవులను కాపాడతాయి. చక్కని పెదవుల కోసం పాలు, గుడ్లు, వెన్న, పచ్చని కూరగాయలని ఆహారంగా తీసుకోవాలి. మామూలుగా పెదవులు డార్క్ గా ఉండటానికి కారణం సూర్య కిరణాల తాకిడి వల్ల, ధూమపానం, మధ్యపానం, వంశపారంపర్యత కారణాలు కావచ్చు.
గులాబీ రంగు పెదవుల కోసం కొన్ని మార్గాలు
రోజూ తీసుకునే జాగ్రత్తలే మన పెదవులు చక్కగా గులాబీ రంగులో మారతాయి. రోజూ పెదవులు శుభ్రపరచుకోవటం అనేది ఒక ముఖ్య పాత్రని పోషిస్తుంది. పెదవులపై ఉండే దుమ్ము ఏప్పటికప్పుడు శుభ్రపరచుకోవటమే మొదటి ముఖ్యమైన పని. రోజూ పెదవులను మస్సాజ్ చేసుకోవటం వల్ల మృత చర్మం పోతుంది. దీనికోసం ఒక టూత్ బ్రష్ తో రోజూ ఇలా రబ్ చేసుకోవాలి. అంతేకాక గులాబీ రేకులు, తేనె, పాలు, దోసకాయ తో పేస్ట్ చేసుకోవాలి. విటమిన్-ఇ ఉన్న లిప్ బాల్మ్ లను మాత్రమే సంరక్షణ కొరకు వాడాలి.
గులాబీ పెదవులకోసం గృహ చిట్కాలు
బీట్రూట్ జ్యూస్
ఇది సహజసిధ్ధమైనది. మీ పెదవులు చక్కటి గులాబీ రంగులో ఉండేందుకు చక్కగా తోడ్పడుతుంది. బీట్రూట్ జ్యూస్ ని రోజూ ఉదయం, సాయంత్రం పెదవులకు రాసుకోవాలి.
క్యారెట్ జ్యూస్
బీట్రూట్ జ్యూస్ మాదిరిగానే ఈ క్యారెట్ జ్యూస్ మీ పెదవులను చక్కగా గులాబీ రంగులోనికి తెస్తుంది. ఒక క్యారెట్ ను తీసుకుని దానిని గ్రైండ్ చేసి ఆ రసాన్ని కాటన్ బాల్ తో రాసుకోవాలి.
గులాబీలు
గులాబీలు పెదవుల రంగు మార్చటానికి ఒక చక్కని మంచి ఏజెంట్స్. వీటిని గ్రైండ్ చేసుకుని ఆ రసాన్ని రాసుకుంటే చక్కగా ప్రకాశిస్తాయి.
దోస
దోస మీ పెదవులకు ఒక కొత్త కాంతిని తెస్తుంది. అంతేకాక రోజూ ఆ దోస ముక్కలతో మస్సాజ్ చేసుకుంటే మంచి రంగు తో మెరుస్తాయి.
ఆరెంజ్ తొక్కలు
ఆరెంజ్ తొక్కలు తీసి పవ్డర్ చేసుకోవాలి. ఈ పవ్డర్ లో పాలు కలుపుకుని పేస్ట్ గా చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మీ పెదవుల మృదుత్వాన్ని పెంచుతాయి. అంతేకాక మీ డార్క్ పెదవుల్ని మార్చి ప్రకాశవంతంగా చేస్తాయి. మీ పెదవులపై వాటిని రెండు నిముషాల పాటు మస్సాజ్ చేసుకోండి. తర్వాత 5 నిముషాలపాటు ఎండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి.
విటమిన్-ఇ
పెదవులు బాగా ఉండాలంటే ముందుగా శరీరం వేడి ఉండకూడదు. అలా ఉండకుండా ఉండేందుకు విటమిన్ -ఈ క్యాప్సుల్స్ రూపం లో దొరుకుతాయి. వాటిని రోజూ వాడాలి.
మీగడ
మీ పెదవులు మృదువుగా ప్రకాశవంతంగా ఉండాలంటే మీగడా రాసుకోవటం మంచిది. దీనితో పాటుగా గులాబీ రేకుల్ని వేసుకుని తర్వాత ఆ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని 20 నిముషాలపాటు ఉంచుకుని తర్వాత శుభ్రపరచుకోవాలి.
గులాబీ రంగు పెదవుల కోసం కొన్ని టిప్స్
1. పొగ తాగటం వల్ల మీ పెదవులు నల్లగా మారిపోతాయి. కాబట్టి దీనిని మానేయాలి.
2. కాఫీ, టీ లు తాగటం వల్ల మీ పెదవులు నల్లగా మారతాయి. కాబట్టి కెఫిన్ వాడకం తగ్గించాలి.
3. యూవీ రేస్ మీ పెదవులని నల్లగా మారుస్తాయి. కాబట్టి దీనికి గానూ మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
4. ఎప్పుడూ పెదవుల్ని చప్పరించుకోవటం వల్ల మీ పెదవులు పొడిబారిపోయి నల్లగా మారతాయి కాబట్టి ఆ అలవాటుని మానుకోవాలి.
5. మీ పెదవులు బాగా ప్రకాశవంతంగా, కాంతివంతంగా, గులాబీ రంగులో ఉండాలంటే మంచి విటమిన్లు, మినరల్స్ బాగా తీసుకోవాలి. కాబట్టి పండ్లు, కూరగాయలు తింటే పెదవులు ఆరోగ్యకరంగా ఉంటాయి.

No comments:

Post a Comment