Thursday 26 January 2017

పై పెదవిపై రోమాలా?

పై పెదవిపై రోమాలా?
హార్మోన్ల సమస్యల వల్ల చాలామంది అమ్మాయిల్లో పైపెదవి, గడ్డంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ప్రతిసారీ పార్లర్‌కి వెళ్లాలంటే కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటారా?



* చెంచా చొప్పున పసుపూ, పాలూ కలిపి సమస్య ఉన్నచోట రాయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీళ్లతో కడిగేయాలి.
* సమపాళ్లలో ఓట్స్‌పిండీ, నీళ్లూ తీసుకుని మెత్తని ముద్దలా చేయాలి. దీన్ని అవాంఛిత రోమాలపై రాసి అరగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా నాలుగు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
* గుడ్డులోని తెల్లసొన దీనికి మంచి పరిష్కారం. తెల్లసొనలో కాస్తంత చక్కెరా, మొక్కజొన్న పిండీ కలిపి ముద్దలా చేసి సమస్య ఉన్నచోట రాయాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలు.
* కాస్తంత సెనగపిండిలో కొద్దిగా పసుపూ, తాజా పాలమీగడా వేసి కలిపి అవాంఛిత రోమాలపై రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
* చిన్న గిన్నెలో చక్కెరా గులాబీనీరూ, కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి పైపెదవిపై రాసి.. దానిపై చిన్న వస్త్రాన్ని ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత దాన్ని తీసేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.
* సమపాళ్లలో పెరుగూ, సెనగపిండీ, పసుపు తీసుకుని ముద్దలా చేయాలి. దీన్ని పైపెదవిపై రాసి మర్దన చేసి పావు గంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది.
* కొద్దిగా ముల్తానీమట్టి తీసుకుని అందులో చెంచా చొప్పున నీళ్లు, చక్కెర వేసి కలపాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాసి పావు గంట తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి.

No comments:

Post a Comment