Friday 27 January 2017

పండగవేళ పసుపు రాసుకుందామా!

పండగవేళ పసుపు రాసుకుందామా!
 సమయంలో సంప్రదాయంగా కనిపించాలనుకోవడం సరే.. మరి దానికి తగినట్టూ మనమూ సహజంగా మెరవాలి కదా. గబగబా ఏదో ఒక పూత వేసేసుకోకుండా.. వంటింట్లో ఉండే పసుపుడబ్బాను తీసుకుని ఇలా చేసి చూడండి.
అరచెంచా పసుపులో చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసి చూడండి. ముఖం తాజాగా కనిపిస్తుంది.
చర్మం శుభ్రపడాలంటే.. చెంచా నిమ్మరసం, అరచెంచా పసుపూ కలిపి ముఖానికి రాసుకోవాలి. సున్నిత చర్మతత్వం ఉన్న వాళ్లు నిమ్మరసంతో పాటూ గులాబీ నీళ్లు కానీ, పాలు కానీ కలుపుకోవాలి.
రెండు చెంచాల గంధం, అరచెంచా పసుపూ, కొన్ని చుక్కల గులాబీ నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.
అరచెంచా పసుపు, రెండు చెంచాల పాలు కలపాలి. దూది ఉండను ఇందులో ముంచి ముఖంపై రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి. చర్మంలో పేరుకున్న జిడ్డూ, మురికీ పోయి.. ముఖంలో కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

No comments:

Post a Comment