Friday 27 January 2017

ఏది నప్పుతుందో చెప్పేస్తారు!
దుస్తులు కావచ్చు, యాక్సెసరీలు కావచ్చు.కొన్నిసార్లు ఏది ఎంచుకోవాలో తెలియక స్నేహితుల సలహా తీసుకుంటాం. అయినా ఏదో సందేహం. తనకు ఐదారుసార్లు ఎదురైన ఈ సమస్యకు పరిష్కారంగా స్టైల్‌డాట్‌మీ అనే యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది మేఘనా సరోగి. మనం కొనాలనుకున్న దుస్తులు, యాక్సెసరీలు ఏవయినా సరే, నచ్చినవి రెండు ఎంచుకుని ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఫలానా సమయంలోగా అభిప్రాయం కావాలని చెప్పేలా టైమర్‌నీ పెట్టాలి. ఆ సమయంలోగా అందులో ఏది నప్పుతుందో తెలియజేస్తూ మీకు ఫ్యాషన్‌ నిపుణులూ, స్టైలిస్ట్‌ల నుంచి సలహాలు వచ్చేస్తాయి. పైగా ఇందులో రకరకాల బ్రాండ్లూ, ఫ్యాషన్‌బ్లాగులు కూడా ఉంటాయి.

No comments:

Post a Comment