Friday 27 January 2017

ఇంటర్వ్యూకి వెళుతున్నారా!

ఇంటర్వ్యూకి వెళుతున్నారా!
క్యాంపస్‌లో కావచ్చు... కార్యాలయంలో కావచ్చు.. ఇంటర్వ్యూకి హాజరయ్యేప్పుడు.. సబ్జెక్టు గురించే కాదు.. ఆహార్యం, అందం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకు తగినట్టు సిద్ధమై వెళ్లాలి. నైపుణ్యాలతోపాటూ ఆహార్యం, దేహభాషనీ పరిగణనలోకి తీసుకుంటారనే విషయం మర్చిపోవద్దు.
సాధ్యమైనంత వరకూ మేకప్‌ తక్కువగా వేసుకోవాలి. ఒకవేళ వేసుకోకపోయినా ఫర్వాలేదు. కానీ కళ్లకు కాటుక పెట్టుకుంటే ముఖం కొందరికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎబ్బెట్టుగా ఉండదు. ఒకవేళ వేసుకుని వెళితే మటుకు చెమటలు పట్టకుండా..మేకప్‌ ఇబ్బందిగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మేకప్‌ గురించే కాదు.. సహజంగా కనిపించేలానూ చూసుకోండి. ముందు రోజు సబ్జెక్టులో నైపుణ్యాలు పెంచుకోవడానికి కుస్తీ పట్టడమే కాదు.. కంటినిండా నిద్రపోవాలి. కీరదోస, బంగాళాదుంప గుజ్జును కళ్ల మీద పెట్టుకుని పడుకుంటే కళ్లు అలసిపోకుండా ఉంటాయి.. మర్నాటికి ముఖం చాలా తాజాగా కనిపిస్తుంది.
జుట్టు విషయంలోనూ అంతే అప్రమత్తంగా ఉండాలి. ప్రొఫెషనల్‌గా కనిపించే దుస్తుల మీద పోనీటెయిల్‌ బాగుంటుంది. జుట్టు వదలకుండా.. ఉండటం మంచిది. అలాగని పట్టు కుచ్చులా కాకుండా కాస్త గ్రీజీగా ఉండేలా చూడండి. చక్కగా చెదిరిపోకుండా లుక్‌ బాగా కనిపిస్తుంది. అలాగరీ మధ్య యువత రకరకాల రంగుల్ని జుట్టు మీద ప్రయోగిస్తోంది. వాటి జోలికి ఎంత మాత్రం వెళ్లొద్దు.

No comments:

Post a Comment