Thursday 26 January 2017

జిడ్డును వదిలించే నిమ్మ..

జిడ్డును వదిలించే నిమ్మ..
అలంకరణా, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో చర్మరంధ్రాల్లోకి మురికీ, జిడ్డూ చేరిపోతాయి. దాంతో చర్మగ్రంథులూ మూసుకుపోయి మొటిమలూ,వైట్‌హెడ్స్‌, మచ్చలు వంటివి మొదలవుతాయి. వాటిని నివారించాలంటే..వైట్‌హెడ్స్‌ తగ్గించుకోవడానికి ఆవిరి పట్టడం తప్పనిసరి. దీనివల్ల చర్మగ్రంథులు తెరుచుకుంటాయి. మురికీ, జిడ్డూ, మృతకణాలూ తొలగిపోతాయి. వేడినీళ్లలో ముంచి పిండిన కాటన్‌ వస్త్రంతో ముఖం తుడిచినా ఫలితం ఉంటుంది.
చెంచా చొప్పున దాల్చిన చెక్క పొడీ, ఓట్స్‌ పిండీ తీసుకుని గోరువెచ్చని నీళ్లతో ముద్దగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొద్దిసేపు మర్దన చేసి, పావు గంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. మొటిమలూ, వాటి తాలూకూ మచ్చలు పోతాయి.
రెండు చెంచాల సెనగపిండిలో సరిపోయేంత పెరుగు వేసి ముద్దగా చేసి ముఖానికి రాయాలి. పది నిమిషాలయ్యాక కడిగేస్తే సరిపోతుంది. ఇందులో పసుపు కలిపితే ఆ సమస్యలు తగ్గడంతోపాటూ ముఖం కూడా కళగా మారుతుంది.
నిమ్మరసంలోని ఆల్ఫాహైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. కణాల పునరుద్ధరణకు తోడ్పడి జిడ్డునీ తొలగిస్తాయి. నిమ్మరసంలో దూది ఉండని ముంచి సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment