ఆ వస్త్రధారణలో ఇలా!
సమావేశాలూ, పార్టీలూ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నప్పుడు ఉద్యోగులకు ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే సూటే ధరించాలనే నిబంధనా ఉండొచ్చు. అలాంటప్పుడు పెద్దగా సమయం లేకపోతే.., ఎంపిక విషయంలో పొరపాటు జరగకుండా ‘ఉమెన్స్ ఫొటో సూట్’ యాప్ ప్రయత్నించి చూడండి. దీని సాయంతో రకరకాల సూట్లని ఎంచుకోవచ్చు. ఈ యాప్‌ని ఉపయోగించడం కూడా తేలిక. మీ ఫోనులోని ఫొటోలని ఇందులో ఉంచి.. మీకు నప్పే రకాన్ని ఎంచుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు ఫొటో తీసుకుని కూడా ప్రయత్నించొచ్చు.
No comments:
Post a Comment