Friday 27 January 2017

చెప్పుల డిజైన్లకో యాప్‌

చెప్పుల డిజైన్లకో యాప్‌
మామూలు సందర్భాల్లో చెప్పుల అందానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వం కానీ పెళ్లీ, వేడుకా అంటే మాత్రం ప్రత్యేకంగా ఉండేవాటి కోసం వెతుకుతాం. డిజైను చేయించుకున్న చీరలూ, డ్రస్సులకు అనుగుణంగా చెప్పులూ కొత్తగా ఉండాలని కోరుకుంటాం. అలాంటివారికి కావాల్సినన్ని డిజైన్లను చూపిస్తోంది వెడ్డింగ్‌ షూస్‌ ఐడియాస్‌ యాప్‌. ఇందులో సంప్రదాయ చెప్పులతో పాటూ పెళ్లిచీరలూ, గౌన్లకు కూడా నప్పే చూడముచ్చటైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. రౌండ్‌ టో, వెడ్జింగ్‌, ఫ్లిప్‌ఫ్లాప్స్‌, బాలేపంప్స్‌ వంటి రకాల్లో పెళ్లికీ, వేడుకలకూ సరిపడే నయాచెప్పులు ఈ యాప్‌లో చూడొచ్చు. అలాగే కొత్తగా వచ్చే ఎత్తుమడమల చెప్పులూ, ఫ్లాట్‌ శాండిళ్లకు సంబంధించిన సమాచారం, భిన్నమైన డిజైన్లను తెలుసుకోవచ్చు. సొంతంగా డిజైను కూడా చేసుకోవచ్చు.

No comments:

Post a Comment