Friday 27 January 2017

ముఖద్వారానికి.. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా!

ముఖద్వారానికి.. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా!
కాలేయం, గుండె... మూత్రపిండాలు వీటి పేరు చెప్పినప్పుడు మనకు వూహమాత్రంగా వాటి ఆకృతీ, పనితీరు మనసులో మెదులుతుంది. కానీ గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) గురించి అటువంటి అవగాహన మనలో ఉందా? ప్రసవ సమయంలో ఎంతో కీలక పాత్ర వహించే ఈ భాగానికి క్యాన్సర్‌తోపాటూ సిస్టుల వంటి వ్యాధుల బెడదా ఉంది. వాటి నుంచి తప్పించుకోవాలంటే.. గర్భాశయ ముఖద్వారం పనితీరూ, దానికి వచ్చే సమస్యలూ, పరిష్కారాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి.

ర్భాశయం, గర్భాశయ ముఖద్వారం ఆకృతుల్లోనే కాదు, వాటి పనితీరుల్లోనూ తేడాలుంటాయి. గర్భాశయం పై భాగంలో ఉంటే, అడుగున గర్భాశయ ముఖద్వారం ఉంటుంది. ఒక కూజాను గనుక బోర్లించి పెడితే ఎలా ఉంటుందో గర్భాశయం, దాని ముఖద్వారం అలాగే కనిపిస్తుంది. గర్భాశయంతో పోలిస్తే, దాని ముఖద్వారంలోని గ్రంథుల పనితీరు వేరు. దీనిలోని కణాలు నిరంతరం మార్పునకు లోనవుతుంటాయి. ఇవి చిన్నతనంలో, యుక్త వయసులో, హార్మోన్ల ప్రభావంతో, గర్భం దాల్చినప్పుడు.. ఇలా వయసూ, సందర్భానికి తగినట్లుగా మారుతుంటాయి. వాటిపై హార్మోన్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

No comments:

Post a Comment