Thursday 26 January 2017

చర్మానికి ఆ రెండే చాలు!

చర్మానికి ఆ రెండే చాలు!
సౌందర్య సంరక్షణకు సంబంధించి కావచ్చు, అలంకరణ విషయంలో కావచ్చు.. మనం చేసే చిన్నచిన్న పొరపాట్లే సమస్యల్ని తెచ్చిపెడతాయి. ఎలాగంటారా..
పెదవుల చుట్టూ లిప్‌లైనర్‌ వేసుకుంటున్నారా. అది ముదురు రంగులో లేకుండా చూసుకోండి. మీరు వేసుకునే లిప్‌స్టిక్‌ లేత రంగులో.. లిప్‌లైనర్‌ ముదురుఛాయలో ఉంటే చూడ్డానికి బాగోదు. పైగా కాస్త పెద్దవారిలానూ కనిపిస్తారు. అందుకే లిప్‌స్టిక్‌, లిప్‌లైనర్‌ ఒకే రంగులో ఉండేలా చూసుకోవాలి.
* చిన్నవయసులో చర్మసంరక్షణ ఉండాలనే ఉద్దేశంతో సీరమ్‌లూ, క్రీంలూ, లోషన్లూ ఇలా రకరకాల ఉత్పత్తులు వాడాల్సిన అవసరంలేదు. దానివల్ల మేలు జరగకపోగా మచ్చలు పడటం.. చర్మరంధ్రాలు పెద్దగా కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మీరు పాతికేళ్లలోపువారయితే.. ఓ సన్‌స్క్రీన్‌, యాంటీఆక్సిడెంట్‌ గుణాలున్న ఏదైనా ఒక క్రీంని ఎంచుకుంటే సరిపోతుంది.
* కాస్త చల్లగా ఉంటే చాలు సన్‌స్క్రీన్‌ అవసరంలేదని మానేస్తుంటారు కొందరు. ఆ చిన్న నిర్లక్ష్యం కారణంగానే చర్మంపై అతినీలలోహిత కిరణాలు పడి.. నల్లగా మారడం, కందిపోవడం వంటివి ఎదురవుతాయి. అందుకే వాతావరణం ఎలా ఉన్నా సరే.. ఏడాదిపొడవునా సన్‌స్క్రీన్‌ని వాడాల్సిందే.
* చర్మంపై పేరుకొన్న మృతకణాల్ని అసలు తొలగించకపోవడం.. లేదా అతిగా తొలగించాలనుకోవడం రెండూ తప్పే. వాటిని నిర్లక్ష్యం చేస్తే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఒకవేళ అదేపనిగా తొలగించే ప్రయత్నం చేస్తే చర్మం పొడిబారే ప్రమాదం ఉంటుంది. అందుకే వారానికోసారి తొలగిస్తే చాలు.

No comments:

Post a Comment