Thursday 26 January 2017

అందానికి సూత్రాలు

అందానికి సూత్రాలు


* నిమ్మపండు తొనలు, కమలా తొనలు, తులసి మొగ్గలు, సీమచామంతి, ఇలా ఏదైనా సరే వాటిరసంతో మసాజ్ చేసుకోవచ్చు. అదే తొనలతోనయితే సరిపోయే నీటిని కలుపుకుని రాసుకుని మసాజ్ చేసుకుని కడిగేసుకోవచ్చు.

* ఒక టీస్పూన్ ఆముదము తీసుకోండి. బీవ్యాక్స్ ఒక అరటీస్పూన్, ఆప్రికాట్ నూనె ఒక అరటీస్పూన్, సముద్రపు ఉప్పు ఒక టేబుల్ స్పూన్, ఆల్మండ్ పౌడర్ ఒక టీస్పూన్, బేబీషాంపూ రెండు టీస్పూన్లు తీసుకోండి. బీవ్యాక్స్ను బాగా కరిగించి ఆముదము ఆప్రికాట్ నూనెలను వేసి బాగా కలపండి. వేడిమీద తీసెయ్యండి. సముద్రపు ఉప్పును, ఆల్మండ్ పౌడర్ని కలిపి, షాంపూలో వేసి బాగా కలియబెట్టండి. ఆ తర్వాత ఉపయోగించండి.

* బొప్పాయి కాయ సగం తీసుకోండి. దానికి నాలుగు టేబుల్స్పూన్ల బియ్పప్పిండి మొత్తాన్ని కలిపి బాగా గుజ్జుగుజ్జుగా పిసకండి. అందులో కొన్ని చుక్కల ఆరెంజ్ నూనెను కలపండి. మొత్తం కలిసేలా కలియబెట్టండి. మిశ్రమమైన ఆ పదార్థాన్ని చేతివేళ్ల చర్మంతో ముఖానికి గుండ్రంగా పూస్తూ ముఖం మొత్తం కవర్ చేయండి. పావుగంట తర్వాత ఆయిల్ను మాయిశ్చరైజర్ను చేసుకోండి. ఆపై శుభ్రంగా వాష్చేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది.

* బంగాళాదుంపల్ని మెత్తగా చేసి రసం తీసిపెట్టుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి, నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా మంచిదే! చర్మం కమిలిపోయిన చోట రాస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది.

* రెండు చెంచాల బంగాళాదుంప రసంలో చెంచా నిమ్మరసం కలిపి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీశాక దూదితో ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పది నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. ఛాయ మెరుగుపడుతుంది. మొటిమలూ, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు దూరమవుతాయి.

* ముల్తానీ మట్టిలో చెంచా బంగాళాదుంప గుజ్జూ, నాలుగు చుక్కల రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. తరవాత చన్నీళ్లలో తడిపిన వస్త్రంతో ముఖం తుడుచుకోవాలి. మర్నాటికి చర్మం తాజాగా తయారవుతుంది.

* బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది.

* కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపను ముక్కల్లా తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత తీసి కళ్ల కింద రుద్దుకోవాలి. కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతి రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా నల్లమచ్చలు తగ్గుముఖం పడతాయి.

* నారింజ తొక్కల్ని అయిదు నిమిషాలపాటు ఉడకబెట్టి చల్లార్చాలి. చల్లారినవాటితో మెడపైన, ముఖం మీద సుతిమెత్తగా రుద్ది అయిదు నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా వారంలో ఒక్కసారయినా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.

* టీస్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమపువ్వు కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే నల్ల మచ్చలు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.

* రెండు చెంచాల పాలల్లో, బాదం పొడి, కలబంద గుజ్జు, తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద ఆప్లై చేసి అరగంటయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఈ కాలంలో వచ్చే చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.

No comments:

Post a Comment