Thursday 26 January 2017

మొటిమలకు పుదీనా పూత!

మొటిమలకు పుదీనా పూత!
మొటిమల సమస్య జిడ్డుచర్మతత్వం ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. వాటిని తగ్గించాలంటే వేపా, తులసీ, లవంగాలూ, పుదీనా వంటివాటితో ఇలా చేసి చూడండి.

* సమపాళ్లలో నిమ్మరసం, తేనె కలిపి మొటిమల మీద రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి ఐదారుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
* నువ్వులూ మొటిమలకు పరిష్కారం చూపుతాయి. వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి మర్నాడు ముద్దలా చేయాలి. దీన్ని మొటిమల మీద రాసి ఆరాక కడిగేసుకుంటే చాలు.
* ముఖానికి బంగాళదుంప రసం రాసినా ఫలితం ఉంటుంది. ఇది మొటిమలని తగ్గించడమే కాక ముఖానికి సహజ మెరుపునిస్తుంది.
* మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు లవంగాలను నీళ్లు, లేదా పాలతో కలిపి మెత్తగా చేయాలి. దీన్ని మొటిమల మీద రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి.
* కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తని ముద్దలా చేయాలి. దీన్ని మొటిమలున్న చోట రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేస్తే మార్పు కనిపిస్తుంది. పుదీనాలో చర్మానికి చల్లదనాన్నిచ్చే గుణాలున్నాయి.
* తులసి ఆకుల ముద్దను మొటిమలపై రాయడం వల్ల అవి తగ్గుతాయి. బజార్లో తులసి ఆకుల పొడి దొరుకుతుంది. దానికి కాసిని వేడినీళ్లు కలిపి పూతలా చేసి మొటిమలపై రాసి, పది నిమిషాల తరవాత కడిగేయాలి.

No comments:

Post a Comment